వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్ కోరిక.. ప్చ్, ఫ్యామిలీ విభేదాలు: ముస్లీంల అండతోనే బీజేపీ చరిత్ర!

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఘోర పరాజయం చవి చూసింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి కనీసం వంద మార్క్‌ను కూడా చేరుకోలేకపోయింది. ఎస్పీ ఓటమికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్నో కారణాలు ఉన్నాయి.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఘోర పరాజయం చవి చూసింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి కనీసం వంద మార్క్‌ను కూడా చేరుకోలేకపోయింది. ఎస్పీ ఓటమికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్నో కారణాలు ఉన్నాయి.

<strong>అక్కడే తప్పు: అఖిలేష్‌ను నిండా ముంచిన రాహుల్ గాంధీ!</strong>అక్కడే తప్పు: అఖిలేష్‌ను నిండా ముంచిన రాహుల్ గాంధీ!

కాంగ్రెస్ పార్టీతో జత కట్టడం, ములాయం కుటుంబంలో విభేదాలు, యాదవుల ఓట్లలో చీలిక.. ఇలా పలు కారణాలు ఉన్నాయి. దీంతో అఖిలేష్ యాదవ్ ఆఖరి కోరిక కూడా తీరకుండా పోయింది.

బీఎస్పీతో పొత్తు... అఖిలేష్ కోరిక నెరవేరలేదు

బీఎస్పీతో పొత్తు... అఖిలేష్ కోరిక నెరవేరలేదు

ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడైన తర్వాత అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. తమకు మేజిక్ ఫిగర్ రాకుంటే అవసరమైతే బీఎస్పీతో కలుస్తామని ప్రకటించారు. కానీ బీజేపీ మాత్రం చరిత్ర సృష్టించింది. 403 స్థానాలకు గాను ఏకంగా 300కు పైగా స్థానాలు గెలుచుకునేలా కనిపిస్తోంది.

చరిత్ర సృష్టించిన బీజేపీ

చరిత్ర సృష్టించిన బీజేపీ

కాంగ్రెస్-ఎస్పీని పక్కన పెడితే.. సమాజ్ వాది పార్టీ కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. ఎందుకంటే బీజేపీ మేజిక్ ఫిగర్ కంటే వంద సీట్లను మించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన మెజార్టీ వచ్చింది.

కుటుంబ విభేదాలు

కుటుంబ విభేదాలు

ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీని కుటుంబ విభేదాలు కూడా ముంచాయి. ములాయం వర్సెస్ అఖిలేష్‌గా పదిపదిహేను రోజుల పాటు గొడవ జరిగింది. ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని అంటున్నారు. కొద్ది రోజులకు బయటకు చూస్తే గొడవ ముగిసినట్లుగా అనిపించినప్పటికీ అప్పటికే నష్టం జరిగింది

ఆ తర్వాత విభేదాలు సమసిపోయినట్లు కనిపించినా..

ఆ తర్వాత విభేదాలు సమసిపోయినట్లు కనిపించినా..

ఎస్పీలో విభేదాలు సమసిపోయినట్లు కనిపించినప్పటికీ లోలోపల మాత్రం ఆ విభేదాలు సమసిపోలేదనే చెప్పవచ్చు. ములాయం పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. అలాగే, ప్రతి ఎన్నికల సమయంలో ఆయన వారణాసిలోని యాదవుల ఘాట్‌కు వెళ్తారు. ఈసారి వెళ్లలేదు. అదే ప్రధాని మోడీ వెళ్లారు. దీంతో ఎంతోకొంత యాదవుల ఓట్లను తమ వైపు మరల్చుకున్నారు.

ముస్లీంల అండ

ముస్లీంల అండ

యూపీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీకి ఓట్లు పడటానికి గల కారణాలను రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూపీలో 20 శాతం వరకూ ఓట్లున్న ముస్లిం వర్గంలోని మహిళలు, ముఖ్యంగా విద్యాధికులు బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచినట్టు వారు ఊహిస్తున్నారు.

ఆ ముస్లీంల అండ ఎందుకంటే..

ఆ ముస్లీంల అండ ఎందుకంటే..

ట్రిపుల్ తలాక్ విషయంలో ఇటీవల బీజేపీ తీసుకున్న చర్యలే వారిని ఆ పార్టీకి ఓట్లు వేసేలా చేశాయని, ఆపై పేదలకు ఉచిత వంట గ్యాస్ పథకం, నోట్ల రద్దు అంశాలు కూడా ప్రభావితం చేశాయని అంచనా వేస్తున్నారు. ముస్లిం మహిళల్లో ఎంతో ఆందోళన కలిగించే ఇస్లాం చట్టాల్లోని ట్రిపుల్ తలాక్ చెల్లబోదని బీజేపీ వాదిస్తుండటం, ఆ వర్గం మహిళలను దగ్గర చేసిందని అంచనా వేస్తున్నారు. యూపీలో ముస్లిం ఓట్లు పడకుండా ఇంత భారీ మెజారిటీ సాధించడం సాధ్యం కాదంటున్నారు.

English summary
Most poll surveys either gave the BJP a clear majority or predicted that the party would fall just short of the 202 halfway mark.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X