వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడే తప్పు: అఖిలేష్‌ను నిండా ముంచిన రాహుల్ గాంధీ!

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఫలితాల సరళిని చూస్తుంటే 250కి పైగా సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీలో ఎస్పీ ఓటమికి స్వయంకృపరాధమే అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఫలితాల సరళిని చూస్తుంటే 250కి పైగా సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీలో ఎస్పీ ఓటమికి స్వయంకృపరాధమే అంటున్నారు.

<strong>యూపీలో గెలుపు!: రాజ్యసభ సహా.. బీజేపీకి లాభాలివే, అతిపెద్ద విక్టరీ</strong>యూపీలో గెలుపు!: రాజ్యసభ సహా.. బీజేపీకి లాభాలివే, అతిపెద్ద విక్టరీ

ముఖ్యంగా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం పెద్ద మైనస్ అంటున్నారు. వరుసగా అన్ని రాష్ట్రాలలో ఓటమి చవి చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి... ఇంకా చెప్పాలంటే యూపీలో ఏమాత్రం ప్రభావం లేని కాంగ్రెస్ పార్టీతో జతకట్టి అఖిలేష్ యాదవ్ తన కొంప ముంచుకున్నారని అంటున్నారు.

అక్కడే పెద్ద పొరపాటు

అక్కడే పెద్ద పొరపాటు

403 అసెంబ్లీ స్థానాలు కలిగిన యూపీలో మేజిక్ ఫిగర్ 202. కాంగ్రెస్‌తో జత కట్టకపోయినా ఎస్పీకి ఇప్పటి కంటే ఎక్కువ సీట్లు వచ్చేవని అంటున్నారు. ఆ పార్టీతో కలవడం వల్ల 100కు పైగా సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. అందులో ఎస్పీ గెలిచే సీట్లు కూడా ఉన్నాయని అంటున్నారు. అక్కడే పెద్ద పొరపాటు జరిగిందని చెబుతున్నారు.

403 స్థానాలలో కనుక ఎస్పీ పోటీ చేస్తే ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే ఎక్కువ వచ్చేవని, అలాగే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేదని అంటున్నారు.

ముందే కలిస్తే..

ముందే కలిస్తే..

మరో విషయం కూడా గుర్తు చేస్తున్నారు. ఎగ్జిట్ ఫోల్ తర్వాత అఖిలేష్ స్పందిస్తూ.. మాయావతితో చేతులు కలిపేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆ కలిసేదేదో కాంగ్రెస్‌తో బదులు బీఎస్పీతో కలిస్తే బాగుండునని అంటున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత కూడా అఖిలేష్ ప్రతిపాదనపై మాయావతి స్పందించక పోవడం కూడా ఇక్కడ గమనించదగ్గ విషయం.

పలుచోట్ల డిపాజిట్లు గల్లంతు

పలుచోట్ల డిపాజిట్లు గల్లంతు

ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీతో జతకట్టిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇరు పార్టీలు కలిసి కూడా వంద సీట్లు గెలవలేకపోతోంది. దీనిని బట్టే కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ పొత్తు పెద్ద తప్పుగా అర్థమవుతోందని అందరూ అంటున్నారు.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీయే పెద్ద మైనస్ అని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. ఇప్పుడు మరోసారి అది రుజువు అయిందని అంటున్నారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మునిగి... ఎస్పీని కూడా నిండా ముంచిందని ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు ఇస్తే 11 సీట్లు మాత్రమే గెలుచుకునేలా ఉంది. ఓటు షేర్ కూడా 11 శాతంగా ఉంది.

English summary
Congress pulls down Samajwadi Party in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X