వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీజీ! బీహార్ గుర్తుందిగా..: బీజేపీకి యూపీలో షాక్ తప్పదా?

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసిస్తుందని, మేజిక్ ఫిగర్‌కు అటు ఇటుగా బీజేపీనే అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. దీనిని బీజేపీ స్వాగతించింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసిస్తుందని, మేజిక్ ఫిగర్‌కు అటు ఇటుగా బీజేపీనే అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. దీనిని బీజేపీ స్వాగతించింది.

అయితే, ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు, బీజేపీ ఆనందంపై ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నీళ్లు చల్లారు! 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమయిందో ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఎగ్జిట్ పోల్ అంచనాలను ఆయన కొట్టి పారేశారు. యూపీలో కాంగ్రెస్‌-సమాజ్‌వాదీ పార్టీ కూటమి తప్పకుండా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీలో విజయం మాదేనని, బీహార్‌ ఎన్నికల ఫలితాల సమయంలోనూ సర్వేలన్నీ బీజేపీకి విజయం తథ్యమని చెప్పాయని, కానీ ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు తప్పు అయ్యాయన్నారు.

<strong>మోడీ హవా, అఖిలేష్‌కు 'రాహుల్' దెబ్బ: మాయావతి 'కీ' రోల్?</strong>మోడీ హవా, అఖిలేష్‌కు 'రాహుల్' దెబ్బ: మాయావతి 'కీ' రోల్?

UP Election Results 2017: On Exit Polls, Rahul Gandhi Says 'Remember Bihar? We Are Winning'

మార్చి 11న తాము మాట్లాడుతామన్నారు. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలపై ఎటువంటి అభిప్రాయం చెప్పలేను అన్నారు. నవంబర్‌ 2015 బిహార్‌ ఎన్నికల ఫలితాల సమయంలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని పలు పోల్స్‌ ఫలితాలు చెప్పాయి. కానీ రాష్ట్రంలో మహాకూటమి గెలుపొందింది. ఇప్పుడు కూడా బీహార్ వలె ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారు అవుతాయని కాంగ్రెస్ చెబుతోంది.

తప్పుబట్టిన పార్టీలు

ఎగ్జిట్ పోల్స్‌ పేరుతో వదంతులు ప్రచారం చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహరించడమేనంటూ పలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు సంధించాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతుండటాన్ని పలు పార్టీలు తప్పుపట్టాయి.

English summary
Congress Vice President Rahul Gandhi has dismissed exit polls aired on Thursday, all of which have predicted that the BJP will be the number one party in Uttar Pradesh, with the Samajwadi Party - Congress alliance trailing in second place. Votes will be counted tomorrow in UP and four other states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X