వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ, షా అండదండలు: యూపీ సీఎంగా తెరపైకి లక్నో మేయర్

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి పదవిని అలంకరిస్తారనే దానిపై ఇప్పుడు ప్రధాన చర్చ సాగుతోంది.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి పదవిని అలంకరిస్తారనే దానిపై ఇప్పుడు ప్రధాన చర్చ సాగుతోంది. ఇప్పటికే పలువురి పేర్లు బయటికి రాగా, ఇప్పుడు మరో నేత పేరు కూడా ముందుకు వచ్చింది. ఆయనే లక్నో మేయర్ దినేష్ శర్మ.

<strong>యూపీలో బీజేపీ గెలవకుంటే కష్టమయ్యేది: కేసీఆర్</strong>యూపీలో బీజేపీ గెలవకుంటే కష్టమయ్యేది: కేసీఆర్

సీఎం రేసులో సాక్షి మహరాజ్‌, ఆదిత్యా యోగినాథ్‌, కేంద్ర మంత్రులు మనోజ్‌ సిన్హా, మహేశ్‌ శర్మ, యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా, దినేష్‌ శర్మ పేరు తెరపైకి వచ్చింది. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు దినేశ్‌ శర్మ అత్యంత సన్నిహితుడు, నమ్మకస్థుడు కావడం గమనార్హం.

<strong>ఐదు రాష్ట్రాల ఫలితాలు: రాహుల్ భారమేనా?, కాంగ్రెస్‌లో తిరుగుబాటు!</strong>ఐదు రాష్ట్రాల ఫలితాలు: రాహుల్ భారమేనా?, కాంగ్రెస్‌లో తిరుగుబాటు!

UP Election Results 2017: Will Mayor Of Lucknow Be Next Chief Minister? Up To Party, He Says

మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే లక్నో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గానూ దినేష్ శర్మ పని చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనపై ఎటువంటి వివాదాలు లేకపోవడంతో పాటు ప్రతీ ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటారనే మంచి పేరు కూడా ఉంది శర్మకు. అంతేగాక, దినేష్ శర్మపై స్థానిక నేతలకేగాక, ప్రజల్లోనూ అమితమైన నమ్మకం ఉండటం ఆయనకు మరో అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

<strong>యుపి సిఎం రేసులో వీరు: అది కూడా కలిసొచ్చిందా?</strong>యుపి సిఎం రేసులో వీరు: అది కూడా కలిసొచ్చిందా?

పలు ప్రాంతాల్లో బీజేపీ ఇంఛార్జీగాను దినేష్ శర్మ పనిచేశారు. ఈ కారణాలన్నింటి వల్లే ఆయన సీఎం అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. కాగా, 'నేను కేవలం పార్టీ కార్యకర్తను మాత్రమే, సీఎం ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది' అని దినేష్ శర్మ చెబుతుండటం గమనార్హం. కాగా, లక్నో నగరంలోని బీజేపీ శ్రేణులు ఇప్పటికే దినేష్ శర్మ సీఎం కావాలంటూ నినాదాలు చేస్తుండటం విశేషం. అయితే, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై యూపీ సీఎం ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది.

English summary
Dinesh Sharma, the Mayor of Lucknow, says the mandate for him and other state leaders from Prime Minister Narendra Modi was simple - win a majority in Uttar Pradesh. Mr Sharma, who had charge of the BJP's membership drive in India, is said to be one of the front runners to be UP chief minister after the party's gigantic win today. The BJP is leading in 312 of UP's 403 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X