• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Viral Video:ఈ మంత్రి పానీపూరీ ఎప్పుడూ తినలేదేమో.. చూడండి ఎలా తింటున్నాడో..!!

|
Google Oneindia TeluguNews

ఐదు రాష్ట్రాల ఎన్నికలు హీట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంలో జోరు పెంచుతున్నాయి.ఇక నాయకుల సంగతి చెప్పక్కర్లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారు పడని కష్టం లేదు.. వారు చేయని ఫీట్లు లేవు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి వెరైటీ క్యాంపెయిన్‌ చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడైతే అన్ని ఫీట్లు చేస్తున్నారు కానీ... రేపు గెలిచాక అసలు వారి ముఖం నియోజకవర్గ ప్రజలకు చూపిస్తారా అన్న అనుమానం చాలామందిలో నెలకొంది. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఇలాంటి ఫీట్లు చేస్తారంటూ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అందరి దృష్టి ఉత్తర్ ప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల పైనే ఎక్కువగా ఉంది. ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో అయితే నాయకుల ఫీట్లు అంతా ఇంతా కాదు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పడరాని పాట్లన్నీ పడుతున్నారు. అలవాటు లేనివి కూడా కొత్తగా ట్రై చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఇక ఉత్తర్ ప్రదేశ్ ఎన్నిక సిత్రాలను ఓ సారి చూద్దాం. గజియాబాద్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే... ఆ రాష్ట్ర మంత్రి అతుల్ గార్గ్ ఎప్పుడూ అలవాటు లేని పని ఒకటి చేశారు. ఫోటోలకు సైతం ఫోజులిచ్చారు. ఇప్పుడు అదే వైరల్‌గా మారుతోంది. ఇంతకీ అతుల్ గార్గ్ చేసిన పనేంటో తెలుసా.. ఎప్పుడూ స్టార్ హోటల్స్‌ లేదా మంచి మంచి రెస్టారెంట్లలో కాస్లీ పీపుల్ పక్కన కూర్చుని లంచ్ లేదా డిన్నర్ చేసే ఈ పొలిటీషియన్ తాజాగా తన నియోజకవర్గంలోని ఓ పానీ పూరి బండి దగ్గర ప్రత్యక్షమయ్యారు. అసలే మంత్రి.. ఇక తన వెనుక ఉన్న అనుచనగనం గురించి చెప్పక్కర్లేదు. ఇక మీడియా ఆగుతుందా... వెంటనే కెమెరాలకు పనిచెప్పింది. ఇదే సందు కదా అని మన మంత్రివర్యులు కూడా పానీ పూరీ భలే లాగించేశారు. లొట్టలేసుకుంటూ మరీ తినేశారు. ఇక ఎలా లొట్టలేసుకున్నారో మీరు చూడండి.

UP Elections 2022: Minister Atul garg eats panipuri, video goes viral

ఇక నామినేషన్ వేసి వచ్చిన ఈ మంత్రివర్యులను మీడియా గోల్‌గప్పా గురించి అడిగారు.. అదేనండీ అక్కడ గోల్‌గప్పా ఇక్కడ పానీపూరీ. అయితే అయ్యవారు చెప్పిన సమాధానం ఏంటంటే... నామినేషన్ వేసి వచ్చాను.. చాలా ఆకలిగా ఉంది. అందుకే వెంటనే గోల్‌గప్పాను లటుక్కున మింగేశాను అంటూ సమాధానం చెప్పాడు. అంతేకాదు ఒక్క పానీపూరీతో సరిపెట్టలేమని ఇవి చాలా రుచిగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే తాను పానీ పూరీ తింటున్న విషయాన్ని అక్కడి వారు అంత తీక్షణంగా గమనిస్తారని తాను అనుకోలేదని చెప్పారు. ఏమైతే ఏంటి... మొత్తానికి మంత్రివర్యులు ఆ పానీపూరి బండి దగ్గరకు వచ్చి పానీ పూరీ తినడంతో ఆ పానీపూరీ బండివాడు కూడా ఫేమస్ అయ్యాడు.

ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. తొలి దశ ఎన్నికలు ఫిబ్రవరి 10వ తేదీన జరుగుతాయి.

English summary
Sitting MLA, minister of state and BJP candidate from Ghaziabad constituency Atul Garg seen eating pani-puri, video goes viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X