వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదే జరిగితే నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీకి కనాకష్టమే: బ్రాహ్మణ ఓటుబ్యాంకు దూరం? ప్రత్యామ్నాయ పార్టీ

|
Google Oneindia TeluguNews

లక్నో: భారతీయ జనతా పార్టీ.. మనదేశంలో అచ్చంగా హిందుత్వ ముద్రను పొందిన ఏకైక రాజకీయ పార్టీ ఇది. బీజేపీ స్థాయిలో హిందుత్వ ముద్రను సాధించిన మరో పార్టీ దేశంలో కనిపించదు. లోపల ఎలా ఉన్నా.. మెజారిటీ రాజకీయ పార్టీలు బయటికి సెక్యులర్ వాదాన్ని వినిపించేవే. హిందూ ఓటుబ్యాంకు మొత్తం తమ పార్టీలోనే ఉండాలనుకునే బీజేపీ నేతలు చాలామందే. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ..ఉత్తరాది రాష్ట్రాల్లో, హిందీ బెల్ట్‌లో ఇలాంటి రాజకీయ వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల మధ్యే 2017లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ల్యాండ్ స్లైడ్ విజయాన్ని నమోదు చేసింది.

బలమైన బ్రాహ్మణ ఓటుబ్యాంకు

బలమైన బ్రాహ్మణ ఓటుబ్యాంకు

2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటుబ్యాంకును బీజేపీ కొల్లగొట్టగలిగింది. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ సొంతంగా 316 స్థానాల్లో ఘన విజయాన్ని సాధించింది. పొత్తు పార్టీలతో కలిపి 318 సీట్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. బ్రాహ్మణ ఓటుబ్యాంకు గంపగుత్తగా బీజేపీకి పడ్డాయనడంలో సందేహాలు అక్కర్లేదు. అప్పటిదాకా ఇతర పార్టీలకు ఓటు వేస్తూ వచ్చిన సంప్రదాయ బ్రాహ్మణ ఓటుబ్యాంకును కూడా బీజేపీ తన వైపు ఆకర్షించుకోగలిగింది. ప్రతిపక్షాలను నామమాత్ర స్థానాలకు పరిమితం చేయగలిగింది.

ఇప్పుడా పరిస్థితి లేనట్టే?

ఇప్పుడా పరిస్థితి లేనట్టే?


ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పుడా పరిస్థితి లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. బ్రాహ్మణ ఓటుబ్యాంకు క్రమంగా దూరమౌతోందనే నివేదిక అందుతున్నాయి. యూపీలో 2022లో ఫస్ట్ హాఫ్‌లో ఎన్నికలు జరుగునున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించగా.. బ్రాహ్మణ ఓటుబ్యాంకు దూరమౌతోందనేది స్పష్టమైనట్లు చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని అయిదు రీజియన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. మెజారిటీ బ్రాహ్మణులు బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు.

కారణాలేంటీ?

కారణాలేంటీ?

హిందుత్వ ముద్ర ఉన్న బీజేపీకి బ్రాహ్మణులు దూరం కావడానికి కారణాలేంటీ? దీనికి ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఠాకూర్లు బలంగా ఎదగడం దీనికి కారణమని చెబుతున్నారు. 20 కోట్ల వరకు ఉన్న ఉత్తర ప్రదేశ్ జనాభాలో బ్రాహ్మణులు 12 శాతం వరకు ఉన్నారు. 2017 ఎన్నికల్లో మెజారిటీ బ్రాహ్మణులు బీజేపీకి ఓటు వేయడం వల్లే ఆ పార్టీ ఘన విజయాన్ని సాధించిందని, ఇప్పుడా ఓటుబ్యాంకు చెదిరిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని అలహాబాద్‌కు చెందిన జీబీ పంత్ సోషియల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ బద్రీ నారాయణ్ అంచనా వేశారు.

అధికారంలో భాగస్వామ్యం లేకపోవడమే..

అధికారంలో భాగస్వామ్యం లేకపోవడమే..

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఓట్ల శాతానికి అనుగుణంగా బ్రాహ్మణ నేతలకు ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కల్పించలేకపోయిందని మనోజ్ త్రిపాఠి అనే కాలమిస్ట్ అభిప్రాయపడ్డారు. తమను పావులుగా మార్చుకున్నారనే అసహనం వారిలో వ్యక్తమౌతోందని తాను అంచనా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ బ్రహ్మభట్ బ్రాహ్మణుడని, కన్యకుబ్జ్, సరయూపరీన్ బ్రాహ్మణులతో పోల్చుకుంటే.. ఆ కమ్యూనిటీకి చెందిన ఓటుబ్యాంకు పెద్దగా లేదని చెప్పారు.

వాజ్‌పేయి నాటి ఛరిష్మా లేనట్టే..

వాజ్‌పేయి నాటి ఛరిష్మా లేనట్టే..

మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో బ్రాహ్మణ నేతలకు పట్టం కట్టే వారని మనోజ్ త్రిపాఠి గుర్తు చేశారు. మురళీ మనోహర్ జోషి, కేసరీనాథ్ త్రిపాఠి, కల్‌రాజ్ మిశ్రా వంటి నేతలు ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడం దీనికి ఓ కారణమౌతోందని చెప్పారు. వాజ్‌పేయి హయాం నాటి నిబద్ధత గల రాజకీయాలు, నేతలు ఉత్తర ప్రదేశ్ బీజేపీలో లేరనే బలమైన అభిప్రాయం కూడా బ్రాహ్మణుల్లో వ్యక్తమౌతోందని చెప్పారు.

Recommended Video

Visakhapatnam : మధురవాడ కొమ్మాది సమీపంలో Quarantine Centre లో అగ్ని ప్రమాదం ! || Oneindia Telugu
వికాస్ దుబే ఎన్‌కౌంటర్ కూడా..

వికాస్ దుబే ఎన్‌కౌంటర్ కూడా..

ఇప్పుడున్న పరిస్థితులే ఎన్నికల వరకూ కొనసాగితే.. బ్రాహ్మణ ఓటుబ్యాంకు అధికంగా ఉన్న ఖుషీనగర్, గోరఖ్‌పూర్, సంత్ కబీర్ నగర్, దేవ్‌రియా, భదోహీ, వారణాశి, అంబేద్కర్ నగర్, సుల్తాన్‌పూర్ నగరాల్లో బీజేపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొనవచ్చని చెబుతున్నారు. మధ్యప్రదేశ్ బ్రాహ్మణుడైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం కూడా ఓటుబ్యాంకుపై ప్రభుత్వం చూపించకపోదని అంటున్నారు. వికాస్ దుబేను అదుపులోకి తీసుకున్న తరువాత ఉద్దేశపూరకంగానే ఆయనను ఎన్‌కౌంటర్ చేశారనే అభిప్రాయం నెలకొందని చెబుతున్నారు.

English summary
The assembly elections in Uttar Pradesh, The Hindi heartland state, known for being the cradle of Bahujan experiment, has this time politicians vying to get Brahmins on their side. Why are Brahmins so important in UP's political landscape?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X