వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి ఏప్రిల్15 డెడ్ లైన్: ప్రభుత్వ ఉద్యోగులంతా ఆస్తులు వెల్లడించాల్సిందే!

ఆదేశాల మాటెలా ఉన్నా ఇచ్చిన గడువు లోగా ఐఏఎస్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆస్తుల వివరాలను అందజేయలేదు. దీంతో ఈ గడువును ఏప్రిల్ 15వరకు పొడగిస్తూ యూపీ నిర్ణయం తీసుకుంది.

|
Google Oneindia TeluguNews

లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో పారదర్శకత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులతో పాటు అధికారులను అవినీతికి దూరంగా ఉంచేలా పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ అధికారులు సైతం తమ ఆస్తులు వెల్లడించాలని గత నెలలో యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఆదేశాల మాటెలా ఉన్నా ఇచ్చిన గడువు లోగా ఐఏఎస్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆస్తుల వివరాలను అందజేయలేదు. దీంతో ఈ గడువును ఏప్రిల్ 15వరకు పొడగిస్తూ యూపీ నిర్ణయం తీసుకుంది. భూమి, ఇళ్లు వంటి స్తిరాస్థి కొనుగోళ్లు, వారసత్వ ఆస్తి, షేర్లు, బ్యాంకు డిపాజిట్లు తదితర వివరాలన్ని అందులో పొందుపరచాల్సి ఉంటుంది.

UP govt extends deadline till April 15 for bureaucrats to declare assets

కాగా, ప్రభుత్వం ఇచ్చిన గడువు సరిపోలేనందు వల్లే అధికారులు ఆస్తుల వివరాలు సమర్పించడంలో విఫలమయ్యారని సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇకపోతే ఐఏఎస్ అధికారులు ఏటా తమ ఆస్తుల వివరాలు వెల్లడిస్తూనే ఉన్నారని, ఇతర ప్రభుత్వాధికారులు వివరాలు సమర్పించడంలోనే జాప్యం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వ సూచన మేరకు ఆస్తుల వివరాలు సమర్పిస్తామని తెలిపారు.

English summary
With a large number of IAS as well as state officers and employees in Uttar Pradesh failing to declare their assets by the 15-day cutoff date on Thursday, the state government has decided to extend the deadline of filing the declaration to April 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X