వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే టీచర్: 25 చోట్ల పనిచేస్తున్నట్టు రికార్డు, 13 నెలల్లో రూ.కోటీ విత్ డ్రా, ఛీటింగ్‌పై ఎంక్వైరీ

|
Google Oneindia TeluguNews

తల్లి, తండ్రి తర్వాత గురువుదే స్థానం. విద్యాబుద్దులు నేర్పి, దారిచూపే గురువు కొన్నిచట్ల దారితప్పుతున్నాడు. కొందరు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా.. మరికొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉపాధ్యాయురాలు ఇలానే ఛీట్ చేశారు. మోసం అంటే మామూలు మోసం కాదు.. ఒకచోటనే పనిచేస్తూ... 25 పాఠశాలల్లో పనిచేస్తున్నానని కలరింగ్ ఇచ్చింది. అలా ప్రభుత్వం నుంచి రూ.కోటి వసూల్ చేసింది.

టీచర్: అనామిక శుక్తా..

టీచర్: అనామిక శుక్తా..

వాస్తవానికి టీచర్ల డాటాబేస్ వెలికితీస్తుండగా విషయం బయటపడింది. లేదంటే ఆమె మరెన్ని రోజులు ప్రభుత్వాన్ని మోసం చేసేవారో. 2020 ఫిబ్రవరి వరకు 13 నెలల నుంచి విద్యాశాఖ నుంచి రూ.కోటి రూపాయల జీతం తీసుకుంది. కానీ ఏమీ తెలియనట్టు అమాయకంగా ఉంది.

ఇలా బయటపడింది

ఇలా బయటపడింది


డాటాబేస్ తీస్తుండగా అనామికా శుక్లా.. మోసం బయటపడింది. అమేథీ, అంబేద్కర్ నగర్, రాయ్ బరేలి, ప్రయాగ్ రాజ్, అలీఘర్ సహా 25 చోట్ల పనిచేస్తున్నట్టు రికార్డులో ఉంది. కానీ ఆమె ఒకచోటకి వెళ్లి మాత్రమే పాఠాలు చెబుతోంది. ఘటనపై విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. దర్యాప్తు జరుపుతున్నామని.. తాము నోటీసులు పంపించినా అనామికా స్పందించడం లేదు అని పేర్కొన్నారు.

ఓకే అకౌంటా..?

ఓకే అకౌంటా..?


విద్యాశాఖ నుంచి నెల నెల జీతాన్ని అనామికా ఎలా డ్రా చేసిందనే అంశంపై స్పష్టత లేదు. 25 స్కూళ్లకు కలిపి ఓకే శాలరీ అకౌంట్ ఇచ్చిందా..? వేర్వేరు ఖాతాలు ఇచ్చిందనే అంశంపై క్లారిటీ లేదు. అనామికా మోసం తెలియడంతో ఆమెకు వేసవిలో ఇవ్వాల్సిన జీతాన్ని నిలిపివేశారు.

చర్యలు తప్పవు

చర్యలు తప్పవు


అనామికాపై మోసంపై దర్యాప్తు ప్రారంభించామని, నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ మంత్రి సతీశ్ ద్వివేది తెలిపారు. స్కూళ్లలో పారదర్శకత కోసం డిజిటల్ డాటాబేస్ రూపొందిస్తున్నామని.. కానీ టీచర్ మోసం బహిర్గతమైందన్నారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్న ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. వాస్తవానికి కేజీబీవీలో కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు జరుగుతున్నాయని.. అనామికా పర్మినెంట్ ఉద్యోగా లేదంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అనే విషయం త్వరలో తేలుతుందని చెప్పారు.

English summary
Anamika Shukla employed in kgbv in Uttar Pradesh under the state basic education department worked simultaneously in 25 schools earning around Rs 1 crore as salaries for over a year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X