వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పోర్న్' వీక్షిస్తే ఇక అంతే సంగతి... సెర్చ్ డేటాపై ప్రభుత్వం నిఘా... ప్రత్యేక పోలీస్ టీమ్...

|
Google Oneindia TeluguNews

రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం దాదాపు 827 పోర్న్ సైట్లను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధం పోర్న్‌ను అడ్డుకోలేకపోయిందన్న వాదన ఉంది. పోర్న్‌ని నిషేధించడం అసలు పరిష్కారం కాదనే వాదన కూడా బలంగా ఉన్నది. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోర్న్ వీక్షణపై కొరడా ఝుళిపించేందుకు సిద్దమైంది. ఇకపై వ్యక్తుల ఇంటర్నెట్ సెర్చింగ్ డేటాపై నిఘా పెట్టనున్నట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. ఎవరైనా సెర్చ్ ఇంజిన్స్‌లో పోర్న్ వీడియోల కోసం సెర్చ్ చేస్తే... వెంటనే ఆ సమాచారం తమకు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా వెంటనే ఆ వ్యక్తి వద్దకు వెళ్లి పట్టుకుంటామని... మహిళలపై నేరాల కట్టడికి ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు.

ఆ కంపెనీతో ఒప్పందం...

ఆ కంపెనీతో ఒప్పందం...

స్మార్ట్ ఫోన్ వినియోగదారుల ఇంటర్నెట్ సెర్చ్ డేటాపై నిఘా పెట్టేందుకు 'Oomuph' అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన కేసులను డీల్ చేసేందుకు 'యూపీ విమెన్ పవర్‌లైన్ 1090' అనే కొత్త పోలీస్ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా పోర్న్ కోసం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే Oomuph ద్వారా వెంటనే తమకు మెసేజ్ వస్తుందని... దాంతో పోలీస్ టీమ్ అప్రమత్తమవుతుందని చెప్పారు.

పోర్న్ వీక్షించేవారి వివరాలతో డేటాబేస్...

పోర్న్ వీక్షించేవారి వివరాలతో డేటాబేస్...

Oomuph కంపెనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ద్వారా ఇంటర్నెట్ వినియోగదారుల సెర్చ్ డేటాపై నిఘా ఉంటుందని... తద్వారా అనలిటిక్స్ టీమ్‌కు సమాచారం అందుతుందని చెప్పారు. సదరు వ్యక్తి లొకేషన్‌ను ట్రాక్ చేసి పోలీస్ టీమ్ అక్కడికి చేరుకుంటుందని చెప్పారు. తద్వారా మహిళలపై నేరాలను అరికట్టవచ్చునని తెలిపారు. సెర్చ్ ఇంజిన్‌లో పోర్న్ సైట్ల కోసం వెతికేవారికి స్క్రీన్‌పై ఒక అలర్ట్ కనిపిస్తుందని చెప్పారు. పోర్న్ సైట్లను వీక్షిస్తున్నవారి డేటా బేస్‌ను రూపొందిస్తామని... వారు ఉంటున్న ప్రదేశాల్లో మహిళలపై నేరాలు జరిగినప్పుడు ఆ డేటా ఉపయోగపడుతుందని తెలిపారు.

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు...

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు...

ఇప్పటికే రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని చేపట్టామని తెలిపారు. జనం నుంచి మంచి స్పందన వచ్చిందని... త్వరలోనే రాష్ట్రమంతా అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఒక్క యూపీలోనే 11.6మిలియన్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారని తెలిపారు. కాగా,దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్నెట్ ఫ్రీడమ్ అనే ఓ సంస్థ ఆర్టీఐకి దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ... ఆ విజ్ఞప్తిని ఆర్టీఐ పోర్టల్ స్వీకరించట్లేదు. మరోసారి తమ దరఖాస్తును ఫైల్ చేసేందుకు ప్రయత్నిస్తామని ఆ సంస్థ వెల్లడించింది.

English summary
If you live in UP, you better not search porn on Google. No, we will not stop you from doing so but the UP Police might. The Police on Saturday revealed that it has hired a company to monitor people’s internet search data. In short, the team would monitor whether people are looking for pornographic content on Google. The measure has been taken to “curb crimes against women”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X