వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యాహ్న భోజనంలో కూరకు బదులు ఉప్పు: ఆ జర్నలిస్టుపైనే కేసుపెట్టారు!

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కూరకు బదులు ఉప్పు వడ్డించిన ఘటన చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నప్పటికీ కొందరు అధికారుల తీరు పాఠశాల విద్యార్థులకు శాపంగా మారుతోంది.

తొలిసారి: కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసిన భారత డిప్యూటీ హైకమిషనర్తొలిసారి: కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసిన భారత డిప్యూటీ హైకమిషనర్

మధ్యాహ్నం భోజనంలో కూరకు బదులు ఉప్పు వడ్డించిన ఫొటోలు, వీడియోలను జనసందేశ అనే హిందీ పబ్లికేషన్‌లో పవన్ జైశ్వాల్ అనే పాత్రికేయుడు ప్రచురితం చేశాడు. ఈ విషయం వెలుగులోకి తెచ్చిన సదరు పాత్రికేయుుడిని అభినందించాల్సిన ప్రభుత్వ అధికారులు.. అతనిపైనే కేసు నమోదు చేయడం గమనార్హం.

UP journalist booked for reporting on salt, roti being served as Mid-day meal

మీర్జాపూర్ జిల్లా సియూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 100మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే, వారికి ఇటీవల మధ్యాహ్న భోజనంలో రోటి పెట్టి.. కూరకు బదులు ఉప్పును వారి పళ్లెల్లో పెట్టారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.

విద్యార్థులకు మంచి భోజనం అందించాలని ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడం బాగానే ఉన్నప్పటికీ.. కూరకు బదులు ఉప్పు వడ్డిస్తున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చిన పాత్రికేయుడు, అతనికి సహకరించిన ఇద్దరు గ్రామస్తులపైనా కేసులు నమోదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

English summary
The journalist who reported that children studying at the government school in Uttar Pradesh’s Mirzapur district were served only chappatis with salt as their Mid-day meal — a flagship scheme of the central government — a case has been filed by the state government against the scribe who shot the video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X