హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చైనాపై ప్రతీకారం తీర్చుకుంటాం.. బోర్డర్ వైపు 10 మంది బుడతలు: దేశం సెల్యూట్

|
Google Oneindia TeluguNews

లక్నో: సరిహద్దులో 20 మంది భారత జవాన్ల ప్రాణం తీసిన చైనాపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. పిల్లల నుంచి పెద్దల వరకు డ్రాగన్ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలంటూ నినదిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా చైనా ఉత్పత్తులను నిషేధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పది మంది పిల్లలు చూపిన ధైర్యసాహసాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

బోర్డర్ వైపు పది మంది పిల్లలు...

బోర్డర్ వైపు పది మంది పిల్లలు...


ఉత్తరప్రదేశ్ అలీగఢ్ జిల్లాలోని అమ్రాద్ ప్రాంతానికి చెందిన 10 మంది పిల్లలు చైనాపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. వీరంతా 7-11ఏళ్ల వయస్సున్న పిల్లలే కావడం గమనార్హం. చైనాకు తగిన గుణపాఠం చెబుతామంటూ సరిహద్దు వైపు బయల్దేరారు ఈ పిల్లలంతా. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి వారిని అడ్డుకున్నారు.

చైనాపై ప్రతీకారం తీర్చుకుంటాం..

చైనాపై ప్రతీకారం తీర్చుకుంటాం..


ఇటువైపు ఎందుకు వెళ్తున్నారు? ఇది బోర్డర్ ప్రాంతం.. ఇటువైపు వెళ్లకూడదు అని సదరు పోలీసు.. పిల్లలను హెచ్చరించారు. అవును మాకు తెలుసు.. అందుకే బోర్డర్ వైపు వెళుతున్నామని చెప్పారు పిల్లలు. అయితే, ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు పోలీసు. మన సైనికులను చంపారు.. మన సత్తా ఏంటో చూపిస్తాం.. ప్రతీకారం తీర్చుకుంటాం.. భారత్ మాతా కీ జై అంటూ పిల్లలు గర్జించారు.

చైనాను మట్టికరిపిస్తాం..

అయితే, మీరు పిల్లలు కదా.. మరి చైనా సైన్యంతో ఎలా పోరాడగలరు? అని ప్రశ్నించగా.. తాము పోరాడుతాం.. చైనాను మట్టికరిపిస్తామంటూ పిల్లలు ధీమాగా చెప్పారు. దీంతో పిల్లల దేశభక్తి, ధైర్యానికి ఆ పోలీసు అధికారి సంభ్రమాశ్చర్యకాలకు గురయ్యారు. ఇప్పుడు మీరు పిల్లలు బాగా చదువుకోండి.. మనమంతా కలిసి చైనాపై ప్రతీకారం తీర్చుకుందామని చెప్పి పోలీసులు.. పిల్లలను ఇంటికి పంపించారు.

ఆ బుడతలకు దేశం సెల్యూట్..

కాగా, గత సోమవారం భారత సరిహద్దులోని గాల్వన్ లోయలో.. చైనా, భారత్ సైన్యం మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. చైనా దొంగదెబ్బ తీసి 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకుంది. అయితే, భారత దళాల ఎదురుదాడిలో సుమారు 45 మంది చైనా సైనికులు హతమయ్యారు. చైనా దొంగదెబ్బతీసి భారత జవాన్ల ప్రాణాలు తీయడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పిల్లలు చూపిన దేశభక్తి, దైర్య సాహసాలకు నలువైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. వీరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఈ బుడతలకు సెల్యూట్ చేస్తున్నారు.

English summary
UP Kids Who Were Headed to China Border to Avenge Death of Our Soldiers Stopped by Cops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X