వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాధితురాలే నేరస్థురాలు...? చిన్మయానంద కేసులో ట్విస్ట్... లా విద్యార్థిని అరెస్ట్...!

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ షాజీపూర్ లా విద్యార్ధికి పోలీసులు షాక్ ఇచ్చారు. స్వామీ చిన్మయానంద పై లైంగిక ఆరోపణలు చేసిన న్యాయ విద్యార్థినిని కూడ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. చిన్మయానంద తనను బ్లాక్‌మెయిల్ చేస్తుందని కేసు నమోదు చేయడంతో విచారణ నిమిత్తం ఆమేను కూడ అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే అరెస్ట్ సంధర్భంలో బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లారని కుటుంబం సభ్యులు మీడియాకు తెలిపారు. అరెస్ట్ అనంతరం ఆమెను విచారణ కోసం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడికి తీసుకున్నారు.

విశాఖ ఏజెన్సీలో గంజాయిపై ఎక్సైజ్ పంజా.. కోట్ల విలువైన సరుకుపై కొరడావిశాఖ ఏజెన్సీలో గంజాయిపై ఎక్సైజ్ పంజా.. కోట్ల విలువైన సరుకుపై కొరడా

చిన్మయానంద కేసులో ట్విస్ట్...

చిన్మయానంద కేసులో ట్విస్ట్...

ఉత్తరప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి అయిన స్వామి చిన్మయానంద కేసు కొత్త మలుపు తిరిగింది.. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ చిన్మయానందపై కేసు నమోదు చేసి బాధితురాలిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్మయానందపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఆయన కూడ రివర్స్ గేర్ వేశారు. లా విద్యార్థిని డబ్బుల కోసం తనను బ్లాక్‌మెయిల్ చేస్తుందనే ఆరోపణలు చేస్తూ కేసును నమోదు చేశారు.

బాధితురాలే నిందుతురాలైంది.

బాధితురాలే నిందుతురాలైంది.

దీంతో చిన్మయానంద ఫిర్యాదును స్వీకరించిన సిట్ పోలీసులు లా విద్యార్థిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమేను విచారించేందుకు నోటీసులు జారీ చేశారు. అయితే బ్లాక్‌మెయిల్ కేసులో తాను అరెస్ట్ కాకుండా న్యాయ విద్యార్థిని కోర్టును సైతం ఆశ్రయించింది. కాని కోర్టు ఎలాంటి ముందస్తు బెయిల్‌కు అంగీకరించక పోవడంతో సిట్ పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. బుధవారం బలవంతంగా ఆమేను అరెస్ట్ చేశారు. బ్లాక్‌మెయిల్ కేసుపై విచారించేందుకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడికి తీసుకున్నారు.

యూపిలో ప్రకంపనలు సృష్టిస్తున్న చిన్మయానంద కేసు

యూపిలో ప్రకంపనలు సృష్టిస్తున్న చిన్మయానంద కేసు

లా విద్యార్థి కేసు గత రెండు నెలలుగా అధికార బీజేపిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో విద్యార్థిని ఆరోపణలపై సుప్రిం కోర్టు సుమోటగా తీసుకుంది.. కోర్టు ఆదేశాలతో కేసును విచారించేందుకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. కోర్టు ఆదేశాలతోనే యూపిలో కాకుండా ఢిల్లీలో చిన్మయానందపై కేసును నమోదును చేసింది. అనంతరం మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. దీనికి తోడు యూపీలో ప్రజలు లా విద్యార్థికి మద్దతుగా ఆందోళనలు నిర్వహించారు. దీంతో వారం రోజుల క్రితమే చిన్మయానందను పోలీసులు అరెస్ట్ చేశారు .ప్రస్తుతం ఆయన 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ.. అత్యాచారం

వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ.. అత్యాచారం

కేసు విచారణలో భాగంగా అంతకుముందు ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హజరైన లా విద్యార్థిని పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. చిన్మయానంద తనను ఎప్పుడు కలిసింది, ఆయన ఏ విధంగా వేధింపులకు పాల్పడింది వివరించింది. చిన్మయానంద తనకు ఆశ్రయమించి నమ్మించాడని పోలీసులకు తెలిపింది. ఆయనకు చెందిన హస్టల్లో ఆశ్రయమిచ్చి స్నానం చేస్తుండగా వీడియోలు తీయించాడని చెప్పింది. ఉద్యోగం పేరుతో వల వేశాడని చెప్పింది. బాత్రూం వీడియోలు చూపించి తనను బ్లాక్‌మెయిల్‌ చేశాడని వివరించింది. వీడియోల నెపంతో సంవత్సరకాలంగా పలుసార్లు అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపింది. విద్యార్థిని ఇచ్చిన సమాచారంతో మొత్తం 12 పేజీల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేసినట్టు సమాచారం.

English summary
The Shahjahanpur law student has been arrested in the extortion case against her and sent to 14-day judicial custody
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X