• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పేకాట వ్యసనం.. డబ్బుల్లేక భార్యను.. స్నేహితులతో ఆ పని..!

|

లక్నో : జూదం .. ఓ వ్యసనం. ఆ అలవాటే కొందరినీ రోడ్డుమీదికి తెస్తుంది. ధర్మరాజు అంతటి వాడే జూదంలో రాజ్యాన్ని కోల్పోయాడు. చివరికి అడవుల పాలయ్యాడు. ఇక కలికాలంలో జూదానికి బానిసలై ఇల్లు, జాగ కోల్పోతున్నారు కొందరు. అయితే ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన జరిగింది. జూదంలో ఓడిపోతే తన భార్యని ఇచ్చేస్తానని పందెం కాశాడో రాయుడు. అతని అతి నమ్మకం వమ్మయిపోయింది. ఇంకేముంది అతని భార్యను అప్పగించాల్సిన పరిస్థితి. ఇదే అదనుగా భావించిన అతని స్నేహితులు ఊరికే వదిలేయకుండా .. లైంగికదాడి చేశారు.

జూదంలో ఓడిపోయి ..

జూదంలో ఓడిపోయి ..

యూపీలోని జౌన్పూరు జిల్లాలోని జఫరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. మద్యంతోపాటు జూదంలో మునిగితేలేవాడు. అతని స్నేహితుడు అరుణ్, బంధువు అనిల్‌తో కలిసి పేటాక ఆడేవాడు. అయితే పేకాటలో ఉన్నదంతా పోవడంతో ఏం చేయాలే తెలియలేదు. సోగ్గాడి పెళ్లాం సినిమాలో హీరో తన వద్ద డబ్బులు అయిపోవడంతో పాపకు తీసుకొచ్చిన పాలను కూడా పెడతాడు. ఈ సీన్ సినిమాలో జూదంతో మనిషి ఎలా మారతాడోనని అద్దం పడుతుంది. జౌన్పూరులో కూడా అలాగే వ్యవహరించాడు. తాను ఓడిపోతే తన భార్యను ఇస్తానని పిచ్చి బెట్టు కాశాడు. కానీ అతడిని విధి వెక్కిరించింది. ఓడిపోవడంతో భార్యను అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. బంధువు అయిన అనిల్ కానీ .. స్నేహితుడు అరుణ్ .. పందెం కాశాడని వదిలేయలేదు. పందెం పందెమే అన్నట్టు అతని భార్యపై లైంగికదాడి చేశారు.

సాముహిక లైంగికదాడి

సాముహిక లైంగికదాడి

భర్త రాక్షసుడిలా మారాడు. బెట్టు ఓడిపోయి తన పెళ్లాన్ని వారికి అప్పగించారు. దీంతో వారు ఆమెపై లైంగిక దాడి చేశారు. భర్త తీరు సరిగాలేదని తన మేనమామ ఇంటికెళ్లిపోయింది. అయితే తాను మారానని అక్కడికొచ్చాడు భర్త. ఇంటికి రమ్మని నంగనాచీలా నటించాడు. నిజమేననుకొని నమ్మి భర్తతో వెళ్లింది. అయితే మార్గమధ్యలోనే కారు ఆపి .. తన స్నేహితులను ఎక్కించుకున్నాడు. వారు మరోసారి ఆమెపై లైంగికదాడి చేశారు. నమ్మించి మోసం చేసిన భర్త, లైంగికదాడి చేసిన నిందితులపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే జఫారాబాద్ పోలీసులు కేసు నమోదు చేయలేదు. లాభం లేదనుకొని ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం కలుగజేసుకొని కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

కోర్టు మొట్టికాయలతో ..

కోర్టు మొట్టికాయలతో ..

జఫారాబాద్‌ పోలీసులకు కోర్టు మొట్టికాయలు వేయడంతో పోలీసులు స్పందించారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు ఎఫ్ఐఆర్ కాపీని కోర్టుకు సమర్పించారు. అయితే తన భర్త, లైంగికదాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతుంది. ఇంట్లో మందు తాగుతూ, పేకాట ఆడే తన భర్త .. తననే ఇస్తానని చెప్పడం, వార్ లైంగికదాడి చేయడం ఏంటని మండిపడింది. వారిపై కఠినచర్యలు తీసుకుంటే మరొకరు ఇలాంటి పిచ్చి పందెలు కాయబోరని పేర్కొన్నది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
a man addicted to gambling and alcohol, bet his wife after running out of money and allowed his friends to gangrape her after losing the stake. The incident took place in Jaunpur district of Uttar Pradesh. After the incident, the victim went to court when the police refused to take action on her complaint. Following a court order, an FIR has been registered in Jaffarabad police station in Jaunpur district. The victim, who lives in the Zafarabad police station area, claimed that her husband was an alcoholic and had put her on stake while gambling. Her husband's friend Arun and relative Anil often used to visit their house for drinking and gambling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more