వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలాక్ తలాక్ తలాక్.. వాట్సాప్‌లో చెప్పిన భర్త, పోలీసులకు బాధితురాలి కంప్లైంట్

|
Google Oneindia TeluguNews

ముజఫర్‌నగర్ : ముస్లిం మహిళల కోసం కేంద్రం ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చిన కొందరు మారడం లేదు. కేసు నమోదుచేసి జైళ్లో వేసే చట్టం అమల్లోకి వచ్చినా వారిలో ఏ మాత్రం ఛేంజ్ రాలేదు. చట్టం అమల్లోకి వచ్చినా తెల్లవారే ముంబైలో ఒకతను వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పాడు. బాధిత మహిళ స్రీన్ షాట్ తీసి ఫిర్యాదు చేసినా సంగతి తెలిసిందే. తాజాగా యూపీలో బాధిత మహిళకు భర్త తలాక్ చెప్పాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో .. వారు కేసు నమోదు చేశారు.

యూపీలోని సిఖేడ జిల్లా బిహరీ గ్రామానికి చెందిన యువతికి కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. కొన్నాళ్లపాటు వారి సంసారం సాఫీగానే సాగింది. తర్వాత భర్త ఉపాధి కోసం కువైట్ వెళ్లిపోయాడు. తర్వాత అతని కుటుంబసభ్యులు యువతిని వేధించడం ప్రారంభించారు. అదనపు కట్నం తేవాలని హరస్ మెంట్ ఎక్కువైంది. రూ. 5 లక్షలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కుటుంబసభ్యులకు భర్త కూడా వంతపాడారు. దీంతో బాధితురాలి భర్త, కుటుంబసభ్యులపై వరకట్నం కేసు పెట్టారు. ఈ కేసు విచారణకు కుటుంబసభ్యులు హాజరవుతున్నారు. దీంతో భర్త కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నాడు. దానికి ఆమె కట్నం వేధింపుల గురించి ప్రశ్నించడంతో .. మిన్నకుండిపోయాడు. కట్నం అడగమని భరోసా రాకపోవడంతో మహిళ కేసు విత్ డ్రా చేసుకోలేదు.

UP man gives triple talaq through WhatsApp

ఈ ఏడాది మే 27న కుటుంబసభ్యులపై వరకట్న వేధింపుల కేసు పెట్టారు మహిళ. దీంతో కుటుంబసభ్యులు, భర్త నుంచి మరింత ఒత్తిడి పెరిగింది. కానీ కట్నం తీసుకురమ్మనే అనడం విశేషం. ఈ క్రమంలో భర్త కేసు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు ఆమె నిరాకరించగా .. వాట్సాప్ కాల్ చేసి తలాక్ చెప్పాడు. తన భర్త తనకు తలాక్ చెప్పాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతను విదేశాల్లో ఉండటంతో నోటీసులు జారీచేసే అవకాశం ఉంది.

English summary
A man divorced his wife here through triple talaq on WhatsApp from Kuwait, where he works as a labourer, after she filed a dowry and harassment case against him and his family, police said Thursday. Police said the dowry and harassment case was filed against the man and his family on May 27 by the woman, alleging that he demanded Rs 5 lakh from her. Police said the accused pressured the woman, who is from Bihari village under Sikheda police station in the district, to withdraw the case, but she refused. On Wednesday, the woman approached the police alleging that her husband divorced her through triple talaq using WhatsApp from Kuwait, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X