వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆడపిల్ల పుట్టిందని తలాక్ , న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు

ఆడపిల్ల పుట్టిందనే కారణంగా ఓ ముస్లిం మహిళకు భర్త తలాక్ చెప్పాడు. ఈ మేరకు బాధితురాలు తనకు న్యాయం చేయాలని ఆమె ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ:ఆడపిల్ల పుట్టిందనే కారణంగా ఓ ముస్లిం మహిళకు భర్త తలాక్ చెప్పాడు. ఈ మేరకు బాధితురాలు తనకు న్యాయం చేయాలని ఆమె ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ మహిళ జాతీయస్థాయిలో క్రీడాకారిణిగా ఎన్నో అవార్డులు కూడ సొంతం చేసుకొంది. అయితే యూపీలోని ఆమ్రోహా ప్రాంతానికి చెందిన షుమైలా జావెద్ జాతీయ స్థాయి నెట్ బాల్ క్రీడాకారిణి.

triple talaq

జావెద్ ఇటీవలే ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయం తెలిసిన ఆమె భర్త, ఫోన్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులిచ్చేశాడు. దీంతో ఆమె తనకు న్యాయం చేయాలని మీడియాను ఆశ్రయించింది. అంతేకాదు ఈ విషయమై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ ను న్యాయం చేయాలని కోరింది.

అయితే ఇదే రాష్ట్రంలోని ఆగ్రాకు చెందిన 22 ఏళ్ళ ఆఫ్రీన్ కూడ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆఫ్రీన్ కు కవల ఆడపిల్లలు పుట్టారు. దీంతో ఆమె భర్త ఆఫ్రీన్ కు ట్రిపుల్ తలాక్ చెబుతూ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. అనంతరం ఆమెకు ఫోన్ ద్వారా కూడ తలాక్ సందేశం పంపాడు.

English summary
A woman from Uttar Pradesh lodged a complaint with the police saying that her husband threatened her with triple talaq after she gave birth to a girl child.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X