వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి ఆదేశించినా.. జిఎస్టీ అంటే ఏంటో చెప్పలేకపోయిన మంత్రి

'నాకు జిఎస్టీ (వస్తు, సేవల పన్ను) అంటే ఏమిటో తెలుసు, కానీ గుర్తుకు రావడం లేదు' ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి చెప్పిన సమాధానం.

|
Google Oneindia TeluguNews

లక్నో: 'నాకు జిఎస్టీ (వస్తు, సేవల పన్ను) అంటే ఏమిటో తెలుసు, కానీ గుర్తుకు రావడం లేదు' ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి చెప్పిన సమాధానం.

<strong>జిఎస్టీ: మొబైల్ బిల్లులు ఎంత పెరుగుతాయంటే.., సెల్ ఫోన్‌ రేట్లపై డైలమా?</strong>జిఎస్టీ: మొబైల్ బిల్లులు ఎంత పెరుగుతాయంటే.., సెల్ ఫోన్‌ రేట్లపై డైలమా?

ఓ వైపు జిఎస్టిపై విపక్షాలు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ప్రజలకు ఎన్నో అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి నేతలు దానిపై అందరికీ వివరించాలని పార్టీ పెద్దలు సూచించారు.

UP Minister Fails to Spell Out Full Form of GST Less Than 48 Hrs Before Rollout

కానీ, యూపీ మంత్రి రమాపతి శాస్త్రి అసలు జిఎస్టీ అంటే ఏమిటో చెప్పలేకపోయారు. జిఎస్టి విధానంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను రూపుమాపి, అవగాహన కల్పించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తన మంత్రివర్గ సభ్యులను ఆదేశించారు.

కానీ ఆయన మంత్రివర్గంలోని ఈ మంత్రి అసలు జీఎస్టీ అంటే ఏమిటో కూడా చెప్పలేకపోవడం గమనార్హం. పక్కన ఉన్న వాళ్లు జీఎస్టీని ఏమంటారో చెబుతున్నా.. సదరు మంత్రి దానిని అందుకోలేకపోయారు.

మంత్రి రమాపతి శాస్త్రి గురువారం మహారాజగంజ్‌ ప్రాంతంలో స్థానిక వ్యాపారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ ప్రాముఖ్యత గురించి వివరించబోయారు.

ఆ సమావేశానికి హాజరైన కొందరు జీఎస్టీ పూర్తి రూపం చెప్పాలని అడిగారు. అందుకు ఆయన తడబడుతూ చెప్పలేకపోయారు. అప్పటికీ పక్కన ఉన్న మరికొందరు ఆయనకు సమాధానాన్ని అందించే ప్రయత్నం చేశారు. కానీ ఆయనకు మాత్రం అది అర్థం కాలేదు.

English summary
Ramapati Shastri's alleged loss of GST memory happened a mere two days after he attended a workshop organised by UP Chief Minister Yogi Adityanath for his ministers to explain the nitty-gritty of GST.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X