వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదోడ్ని.. హోటల్లో డబ్బు పోయింది, దొరకకుంటే ఆత్మహత్య చేసుకుంటా: అసెంబ్లీలో ఏడ్చిన ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ శాసన సభ్యుడు అసెంబ్లీ సాక్షిగా రోధించారు. తన డబ్బులు పోయాయని, వాటిని తిరిగి రికవరీ చేయకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. సదరు ఎమ్మెల్యే పేరు కల్పనాథ్ పాశ్వాన్. అతను సమాజ్‌వాది పార్టీ మెహ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. తన డబ్బు చోరీకి గురైందని అసెంబ్లీలో రోదించారు.

ఎమ్మెల్యే కల్పనాథ్‌ ఆజాంగఢ్‌లోని ఓ హోటల్లో రూ.10 లక్షలు దాచారు. ఆదివారం రాత్రి హోటల్లో దొంగలు పడి ఆ డబ్బు దోచుకున్నారు. దాంతో కల్పనాథ్‌ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అసెంబ్లీలో ఈ విషయం గురించి ప్రస్తావించారు. పోయిన పది లక్షల రూపాయలు తిరిగి ఇప్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ కంటతడి పెట్టారు.

 UP MLA breaks down in Assembly, threatens to commit suicide if stolen money not found

మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, తనకు ఇక్కడ న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్లాలని, తాను చాలా పేదవాడినని, రూ.10 లక్షలు తిరిగి ఇప్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదు.

ఎమ్మెల్యే కల్పనాథ్‌ విషయం గురించి మంత్రి సురేశ్‌ కుమార్‌ ఖన్నా స్పందిస్తూ.. న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆయన ఒప్పుకొంటేనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామన్నారు. అయితే పేదవాడినని చెప్పుకొంటున్న కల్పనాథ్‌ అంత భారీ మొత్తాన్ని హోటల్‌ గదిలో ఎందుకు దాచారన్న విషయం చర్చనీయాంశంగా మారింది.

English summary
A Samajwadi Party (SP) MLA broke down in the Uttar Pradesh Assembly on Monday and threatened self-immolation if the money stolen from him a month ago was not recovered within a fortnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X