• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్ affair: ముగ్గురు పిల్లల తల్లి -పక్కింటి 15ఏళ్ల కుర్రాడితో పరార్ -యూపీలో ఘటన, పోలీసుల గాలింపు

|

రికార్డుల ప్రకారం దేశానికి క్రైమ్ క్యాపిటల్ గా కొనసాగుతోన్న ఉత్తర ప్రదేశ్ లో మరో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. యూపీలో నమోదవుతోన్న లైంగిక దాడి, లైంగిక అకృత్యాలకు సంబంధించిన నేరాల్లో చాలా వరకు టీనేజర్లు, చిన్నపిల్లలే బాధితులుగా ఉంటున్నారు. మెజార్టీ నేరాలు బాలికలపైనే కొనసాగుతుండగా, బాధిత బాలుర సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా మధ్యవయస్కురాలైన ఓ మహిళ.. టీనేజ్ బాలుడితో కలిసి పరారైన సంఘటన సంచలనం రేపింది..

రైల్వేలో రూ.లక్ష కోట్లు ప్రైవేటు చేతికి -ఆస్తుల అమ్మకంలో మోదీ సర్కార్ జోరు -శాఖలవారీగా టార్గెట్లు ఇవేరైల్వేలో రూ.లక్ష కోట్లు ప్రైవేటు చేతికి -ఆస్తుల అమ్మకంలో మోదీ సర్కార్ జోరు -శాఖలవారీగా టార్గెట్లు ఇవే

ముగ్గురు పిల్లల తల్లి..

ముగ్గురు పిల్లల తల్లి..

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలో గల కంపీర్ గంజ్(చౌముఖా)లో చోటుచేసుకున్న ఈ అసాధారణ సంఘటనపై పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా భర్తతో కలిసి జీవిస్తోన్న ఓ మహిళకు ముగ్గురు పిల్లలున్నారు. వాళ్లుండే ఇంటికి సమీపంలోనే ఏడో తరగతి చదువుతోన్న బాలుడూ కుటుంబంతో జీవిస్తున్నాడు. వీళ్లిద్దరూ మార్చి 10 నుంచి కనిపించకుండా పోయారు. దీనిపై..

15ఏళ్ల కుర్రాడితో క్లోజ్..

15ఏళ్ల కుర్రాడితో క్లోజ్..

మధ్యవస్కురాలైన మహిళ తన పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి కనిపించకుండా పోవడంతో కుటుంబీకులు ఆందోళను గురై తెలిసినవాళ్ల ఇళ్లతోపాటు ఊరంతా గాలించారు. అదే సమయంలో ఆ ఊరికే చెందిన 7వ తరగతి పిల్లాడి కోసం కూడా అతని కుటుంబం గాలించింది. వాళ్లిద్దరూ కలిసే పారిపోయారని బంధువులు గుర్తించడానికి ఎంతో సమయం పట్టలేదు. ఎందుకంటే, సదరు మహిళ కొంత కాలంగా ఈ బాలుడితో అత్యంత చనువుగా ఉంటుండం రెండు కుటుంబాలూ గుర్తించాయట. కానీ..

తిరుపతి ఉప ఎన్నిక: బరిలో బీజేపీ -అధికారిక ప్రకటన -పవన్ చెవిలో మళ్లీ కమలం పువ్వుతిరుపతి ఉప ఎన్నిక: బరిలో బీజేపీ -అధికారిక ప్రకటన -పవన్ చెవిలో మళ్లీ కమలం పువ్వు

పిల్లాడిని మభ్యపెట్టి తీసుకెళ్లింది..

పిల్లాడిని మభ్యపెట్టి తీసుకెళ్లింది..

కంపీర్ గంజ్ లో ఏడో తరగతి చదువుతున్న 15 ఏళ్ల కుర్రాడు, ముగ్గురు పిల్లల తల్లికి మధ్య ఇలాంటి సంబంధం ఉంటుందని తాము ఊహించలేకపోయామని ఇరు కుటుంబాలు పోలీసుల ముందు విస్తుపోయాయి. బాలుడు తరచూ ఆమె ఇంటికి వస్తుండేవాడని, క్రమంగా పరిచయం పెరిగి, ఆ కుర్రాడికి మాయ మాటలు చెప్పి ఆమె తన శారీరక కోరికలు తీర్చుకునేదని, కొంత కాలంగా వారి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిందని వెల్లడైంది. తమ కొడుకును ప్రలోభ పెట్టి నిందితురాలు తనతో తీసుకెళ్లిందని బాలుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. పారిపోయిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు..

English summary
A surprising case has come to light in Gorakhpur, UP. A woman resident of the village escaped with a 15-year-old boy. The boy is a student of the seventh class. After this incident, the atmosphere of the entire village is warm. The whole village has been stirred up after the mother of three escaped with a 15-year-old boy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X