వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్ధరాత్రి 2.45 గంటలకు అంత్యక్రియలు: కుటుంబసభ్యులకు దక్కని కడసారి చూపు.. ఉద్రిక్తత...

|
Google Oneindia TeluguNews

యూపీలో లైంగికదాడి గురై చనిపోయిన మహిళ అంత్యక్రియలను పోలీసులు బలవంతంగా నిర్వహించారు. లైంగికదాడి గురైన మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి 10.10 గంటలకు మృతదేహం సప్తార్ గంజ్ ఆస్పత్రి నుంచి హథారస్ తీసుకొచ్చారు. అయితే లైంగికదాడి జరగడం, స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో నేరుగా శ్మశానవాటికకు తీసుకొచ్చారు. ఆ రోజు అర్ధరాత్రి 2.45 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే కడసారి చూస్తామని, తమ ఇంటికి తీసుకెళతామని ఫ్యామిలీ మెంబర్స్ కోరగా.. పోలీసులు నిరాకరించారు.

 ఆస్పత్రి ఎదుట ఆందోళన..

ఆస్పత్రి ఎదుట ఆందోళన..

అంతకుముందు కూడా బాధితురాలి తండ్రి, సోదరుడు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమ అనుమతి తీసుకోకుండా పోలీసులు మృతదేహాం తీసుకెళ్లారని పేర్కొన్నారు. వారి ఆందోళనకు కాంగ్రెస్, భీం ఆర్మీ మద్దతు తెలిపింది. సప్తార్ జంగ్ ఆస్పత్రి వద్ద జన సమూహం పెరగడంతో.. భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం ఆందోళనలో కుటుంబ సభ్యులు పాల్గొనలేదని.. పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారని తెలిపారు. వివిధ గ్రూపులకు సంబంధించిన ప్రతినిధులు.. సమస్యను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తర్వాత కుటుంబసభ్యులకు కలెక్టర్, ఇతర అధికారులు నచ్చజెప్పారని తెలియజేశారు. అయితే ఆందోళనకారులతో పోలీసులకు ఆస్పత్రి మధ్య వాగ్వివాదం జరిగింది.

 రాత్రికి రాత్రే మృతదేహం తరలింపు..

రాత్రికి రాత్రే మృతదేహం తరలింపు..

దీంతో పోలీసులు బాధితురాలి మృతదేహన్ని హథరాస్ తీసుకొచ్చారు. ఢిల్లీ నుంచి బాధితురాలి కుటుంబం కూడా స్వగ్రామం వచ్చి.. అంత్యక్రియలను రాత్రి చేయాలని పోలీసులు కోరారు. సున్నితమైన అంశం కావడంతో ఉద్రిక్త నెలకొనే పరిస్థితి ఉంది. దీంతో రాత్రి అంత్యక్రియలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులను కూడా ఒప్పించారు. అయితే తమది హిందూ సంప్రాదాయం అని.. అంత్యక్రియలు రాత్రి నిర్వహించేందుకు వారు అంగీకరించలేదు. కానీ పోలీసులు మాత్రం శాంతి భద్రతల దృష్ట్యా.. రాత్రి నిర్వహించారు.

Recommended Video

Motkupalli Narasimhulu Warns Ysrcp Goverment
చంద్రశేఖర్ ఆజాద్ నిరసన.. అదుపులోకి

చంద్రశేఖర్ ఆజాద్ నిరసన.. అదుపులోకి

మరోవైపు సప్తార్ జంగ్ ఆస్పత్రి వద్ద నిరసన తెలియజేస్తున్న భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిపై లైంగికదాడి చేసి చనిపోయేందుకు కారణమైన వారికి ఉరిశిక్ష విధించాలని ఆజాద్ డిమాండ్ చేశారు. శిక్ష విధించేవరకు వీధులలో తిరిగి ఆందోళన చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమ ఓపికను పరీక్షించొద్దు అని.. నిందితులకు శిక్ష పడేవరకు తమ పోరాటం ఆగదన్నారు.

English summary
body of the Dalit woman who was gangraped and murdered allegedly by four men in Hathras, Uttar Pradesh, was cremated at 2: 45 am on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X