వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమ వలసదారులపై కొరడా... బంగ్లాదేశీయుల కోసం జల్లెడ

|
Google Oneindia TeluguNews

అక్రమ చొరబాటుదారుల కోసం యూపీ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశీయులతోపాటు అనుమతులు లేకుండా అక్రమంగా నివసిస్తున్నవారిని, ఎక్కడ ఉన్నా, వారిని వెతికి పట్టుకోవాలని యూపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా పోలీసులు అన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్ర అంతర్గత భద్రత కోసం ఈ ఆపరేషన్ చేపట్టినట్టు యూపీ పోలీసులు తెలిపారు. దీంతో గత రెండు రోజులుగా అక్రమ చొరబాటుదారుల కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి

యూపీ ప్రభుత్వం అక్రమ వలసదారులపై కొరఢా ఝలిపించింది. ముఖ్యంగా బంగ్లాదేశీయులపై నిఘాను పెంచింది. వారి అచూకి కనుగొనేందుకు యూపీ డీజీపీ ఓపీ సింగ్ ఓ సర్క్యూలర్‌ కూడ విడుదల చేశారు. దీంతో వివిధ మురికి ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలతో పాటు బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, నగరశివారు ప్రాంతాల్లో పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతోపాటు ఎవరైన అనుమానంగా ఉన్నా వారి వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు అనుమానితుల ఫింగర్‌ప్రింట్స్ కూడ తీసుకుంటున్నారు. తప్పుడు దృవ పత్రాలతో రాష్ట్రంలో ఉంటున్నవారి వివరాలు కూడ సేకరించాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి.

UP police launch a drive for identification of illegal Bangladeshi immigrants

ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో పాటు ఇతర దేశస్థులు అటు పశ్చిమబెంగాల్‌తో పాటు ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లోకి ఎక్కువగా చొరబడ్డారనే అనుమానాలను కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. అయితే పశ్చిమబెంగాల్‌లో మమతా సర్కార్ ఎన్ఆర్‌సీని వ్యతిరేకిస్తోంది. దీంతో ఎన్ఆర్‌సీ నివేదికపై కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదం నెలకోంది. బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీలో విదేశీయుల లెక్క తేలిన తర్వాత అక్కడ కూడ ఎన్‌ఆర్‌సీని అమలు చేసేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే యూపీ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ సైతం రాష్ట్రంలో కూడ ఎన్‌ఆర్‌సీ అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు తమ దాడులను ముమ్మరం చేశారు.

English summary
Uttar Pradesh police launch a drive for identification and verification of illegal Bangladeshi immigrants and other foreign nationals, staying across the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X