వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోయిడా-ఢిల్లీ రహదారిని తెరిచిన యూపీ పోలీసులు.. ఆ వెంటనే క్లోజ్, ఎందుకు తెలుసా..?

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టం సెగలు ఢిల్లీలో రాజుకుంటూనే ఉన్నాయి. షహీన్‌బాగ్, జమియా మిలియా వర్సిటీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఢిల్లీ కలింద్ కుంజ్‌ను కలిపే నోయిడా రహదారిని శుక్రవారం తెరిచారు. కలింద్ కుంజ్ తర్వాత గల్లీలో షహీన్‌బాగ్ ఉంటుంది. గత కొన్నిరోజులుగా ఆందోళన నేపథ్యంలో రహదారిని కొద్ది సేపు తెరిచి.. తర్వాత మూసివేశారు.

నోయిడా- ఢిల్లీ, ఫరీదాబాద్‌ను కలిపే మహమయ ఫ్లైఓవర్ వద్ద ఉన్న బ్యారికేడ్లను పోలీసులు తొలగించారు. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. అయితే సమీపంలో ఓ బస్సు ఉండటం, ట్రాఫిక్ అంతరాయం కలగడంతో బ్యారికేడ్లను తీసివేసినట్టు తెలుస్తోంది. అక్కడినుంచి బస్సు వెళ్లిపోయాక.. తిరిగి బారికేడ్లను ఎప్పటిలాగే పెట్టి ఫ్లై ఓవర్ క్లోజ్ చేశారు.

UP Police reopens Noida-Delhi road shut due to Shaheen Bagh protest..?

షహీన్‌బాగ్, కలింద్ కంజ్ నుంచి కేవలం రెండు, మూడు కిలోమీటర్ల దూరంలోనే వాణిజ్య సముదాయాలు, గృహోపకరణాలకు సంబంధించిన షాపులు, రెస్టారెంట్లు ఉన్నాయి. షహీన్‌బాగ్ నుంచి ఉన్న రహదారి అట్లాంటా వాటర్ పార్క్‌తో ముగుస్తోంది. షహీన్‌బాగ్-కలింద్ కంజ్ రహదారిని నోయిడా- గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వేకి సమాంతరంగా ప్రజలు ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఢిల్లీ, నోయిడా వాసులు ఎక్కువగా యూజ్ చేస్తారు.

Recommended Video

Priyanka Gandhi Arrives In Varanasi To Meet BHU Students || Oneindia Telugu

ఆందోళనకారులు మాత్రం షహీన్‌బాగ్-కలింద్ కంజ్ రహదారులను మాత్రమే ఎందుకు మూసివేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. జీడీ బిర్లా రోడ్, కలింద్ కంజ్ బ్రిడ్జి, ఆమ్రపాలీ రోడ్, ఓక్లా బ్యారేజ్ రోడ్, ఓక్లా బర్డ్ సాంచురీ రోడ్, దాద్రీ మెయిన్ రోడ్, నోయిడా, గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వే తెరిచారు కదా అని గుర్తుచేస్తున్నారు.

English summary
Uttar Pradesh Police on Friday reopened a key route that links Noida with Delhi's Kalindi Kunj but only for a few minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X