వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టు హాల్లో కానిస్టేబుల్ బట్టలూడదీయించిన జడ్జి.. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటో తెలుసా?

|
Google Oneindia TeluguNews

ఆగ్రా : యూపీలో ఓ జడ్జి దారుణంగా వ్యవహరించాడు. ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను కోర్టు హాలులో అర్థనగ్నంగా నిల్చోమని ఆర్డర్ వేశాడు. 50 ఏళ్ల వయసు దాటిన కానిస్టేబుల్ వయసుకు సైతం గౌరవం ఇవ్వని సదరు జడ్జి వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. యూపీ పోలీసులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికారులు సదరు జడ్జిని ట్రాన్స్‌ఫర్ చేశారు.

ఓవర్ టేక్‌కు అవకాశమివ్వని కానిస్టేబుల్

ఓవర్ టేక్‌కు అవకాశమివ్వని కానిస్టేబుల్

ఆగ్రా జిల్లా కోర్టుకు చెందిన అడిషన్ చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ర్యాంకు జడ్జి శుక్రవారం కోర్టుకు బయలుదేరారు. అయితే ఆయన వాహనం ముందు పోలీస్ జీపు వెళ్తోంది. దాన్ని నడుపుతున్న కానిస్టేబుల్ గూరే లాల్ జడ్జి వాహనం ఓవర్ టేక్ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. ఇలా రెండు కిలోమీటర్ల దూరం వరకు జడ్జి ప్రయాణిస్తున్న కారు జీపు వెనకే వెళ్లాల్సి వచ్చింది. దీంతో సదరు న్యాయమూర్తికి కోపం నషాళానికంటింది. వెంటనే సదరు కానిస్టేబుల్‌ను కోర్టులో హాజరుకావాలని ఆదేశించాడు.

అర్థనగ్నంగా నిలబడాలని ఆదేశం

కోర్టుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు దారి ఇవ్వనందుకు శిక్షగా కానిస్టేబుల్‌ను ఒంటిపై నుంచి యూనిఫాం తీసివేసి కోర్టు హాలులో నిలబడాలని ఆదేశించాడు. దీంతో గూరే లాల్ తప్పనిసరి పరిస్థితుల్లో బట్టలు తీసి గంటపాటు కోర్టు హాలులో నిల్చున్నాడు. కనీసం తన వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా జడ్జి దారుణమైన శిక్ష విధించడంపై లాల్ మనస్థాపానికి గురయ్యాడు. ఆగ్రా పోలీస్ ఉన్నతాధికారుల ముందు తన గోడు వెళ్లబోసుకుని బోరున విలపించాడు. తాను ఇక విధులు నిర్వహించలేనని తనకు వాలంటరీ రిటైర్‌మెంట్ ఇవ్వాలని కోరాడు.

ట్వీట్ చేసిన యూపీ పోలీసులు

కానిస్టేబుల్ లాల్‌కు జరిగిన అవమానం గురించి డీజీపీ‌కి చేరడంతో ఆయన విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని యూపీ పోలీసులు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించే పోలీసులకు కనీస గౌరవం ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వారికీ పరువు మర్యాద ఉంటుందన్న విషయం దృష్టిలో పెట్టుకుని సమాజంలోని అన్ని వర్గాలు పోలీసులకు గౌరవం ఇవ్వాలని కోరారు.

జడ్జిని ట్రాన్స్‌ఫర్ చేసిన హైకోర్టు

జడ్జిని ట్రాన్స్‌ఫర్ చేసిన హైకోర్టు

పోలీసు పట్ల దారుణంగా వ్యవహరించిన జడ్జి వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తడంతో అలహాబాద్ హైకోర్టు స్పందించింది. సదరు జడ్జిని మహోబాకు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించి జడ్జి వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

English summary
A Judge in the district court in western Uttar Pradesh's Agra town was transferred Saturday afternoon, hours after reports that he had allegedly ordered a UP police constable in uniform to disrobe and stand in his court room for about an hour on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X