• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘అయోధ్య’ కావాలి టూరిస్ట్ కేంద్రం: ఇదీ స్థానికుల మాట

By Swetha Basvababu
|

ఫైజాబాద్: అయోధ్య పేరు కేవలం పేపర్లపైనే ఉంటుంది తప్ప, పర్యాటక కేంద్రమైనా ఒక్క టూరిస్టూ ఇక్కడకు రాడని వర్ధమాన్ అనే వ్యాపారి చెప్తున్నాడు. మథుర వంటి ప్రదేశాలకు విదేశీ ప్రముఖులు వచ్చి పోతుంటారని చెప్పాడు.

మథురలో మాదిరిగా అయోధ్యలోనే వందల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయని ప్రతియేటా మూడు మేళాలు జరుగుతాయని, దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి వెళుతుంటారని తెలిపాడు. పట్టణంలోని ప్రతి దుకాణంలోనూ బిజినెస్ బాగా జరుగుతుందన్నాడు. అయోధ్యలో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు భారీగా కేటాయిస్తున్నా, అవి ఎటువెళుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు.

రామ మందిర నిర్మాణం గురించి పదేపదే కబుర్లు చెప్తారే తప్ప ఓపెన్ డ్రెయినేజీల మూసివేతకు మాత్రం చర్యలు తీసుకోరని రాంచంద్ గుప్తా చెప్తున్నాడు. బిజెపి, ఆరెస్సెస్‌లకు అయోధ్య చాలా కీలకమని, 2012 వరకు రెండు దశాబ్దాలుగా బీజేపీ ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వచ్చింది.

త్రిముఖ పోరులో హోరాహోరీ...

త్రిముఖ పోరులో హోరాహోరీ...

వివాదాస్పద రామజన్మభూమి నెలకొన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతున్నది. అయోధ్య-ఫైజాబాద్‌ జంట నగరాల్లో మొత్తం ఐదు స్థానాలకు గత 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మిల్కిపూర్‌, అయోధ్య, గోశాల్‌గంజ్‌, బికాపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించగా రుడౌలీలో మాత్రం బిజెపి గెలుపొందింది. సుమారు మూడుదశాబ్దాల పాటు దేశ రాజకీయాలకు కేంద్రంగా మారిన వివాదాస్పద రామజన్మభూమి - బాబ్రీ మసీదు అంశం విషయమై స్థానికంగా ప్రస్తుతం పరిస్థితులు సమూలంగా మారిపోయాయి. ప్రజలు అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తున్నారు. నిరుద్యోగం, వలసలు, ధరల పెరుగుదల ప్రధాన అంశాలుగా మారాయి. మొత్తం ఐదు నియోజకవర్గాల్లో ఐదోదశలో భాగంగా సోమవారం పోలింగ్ జరుగుతున్నది.

అప్పుడు మోడీ మానియా

అప్పుడు మోడీ మానియా

2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి హవా బలంగా వీచింది. ఫైజాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి నుంచి లల్లూసింగ్‌ విజయం సాధించారు. అలాగే ఓటింగ్‌ సరళి జరిగితే బిజెపి విజయం తథ్యమని స్థానికులు పేర్కొన్నారు. ఎస్పీ, బీఎస్పీ, బిజెపి మధ్య త్రిముఖపోరు నెలకొంది. అయోధ్యలో బిజెపి అభ్యర్థి వేద్‌ ప్రకాశ్‌, ఎస్పీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తేజ్‌నారాయణ్‌ పవన్ పాండే, బీఎస్పీ నుంచి బజ్మి సిద్ధిక్‌ బరిలో ఉన్నారు. మైనార్టీ ఓటు ఎస్పీ, బీఎస్పీల మధ్య చీలిపోతే బిజెపి అవలీలగా విజయం సాధించగలదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న సాధువుల ఓట్లపై బిజెపి ఆశలు పెట్టుకున్నది. పరిస్థితులు అనుకూలిస్తే మిగతా నాలుగు నియోజకవర్గాల్లో తమకు గెలుపు తథ్యమని కమలనాథులు భావిస్తున్నారు.

ఎస్పీవన్నీ కబుర్లే...

ఎస్పీవన్నీ కబుర్లే...

ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న ఎస్పీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తమకు అనుకూలంగా కలిసి వస్తాయని ఎస్పీ అభ్యర్థులు ఆశిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఎస్పీ నాయకులు కబుర్లు తప్ప, ఆచరణలో తమ సంక్షేమం, అభ్యున్నతి కోసం ఏమీ చేయరని స్థానికులు అంటున్నారు. ఐదేళ్ల క్రితం ప్రతి గ్రామంలో సమాధులకు సరిహద్దు గోడలు ఏర్పాటుచేస్తామని ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని అయోధ్యలోని సుబేర్ మహ్మద్ అనే షాపు యజమాని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో తమ సమస్యల పరిష్కారంతోపాటు భద్రత కల్పించే వారు కావాలని కోరుతున్నారు. కానీ 2012లో గెలుపొందిన ఎస్పీ అభ్యర్థి పవన్ పాండేకు ఆ ప్రాంతం డెవలప్‌మెంట్ కోసం అఖిలేశ్ తన క్యాబినెట్‌లో చోటు కల్పించారు కూడా. వ్యక్తిగతంగా లబ్ది పొందిన పవన్ పాండే తమ సంక్షేమం గురించి పట్టించుకోవడం మరిచిపోయాడని రుద్రమాన్ సింగ్ అనే పౌరుడు తెలిపారు. అయోధ్య పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు పవన్ పాండేకు పలు అవకాశాలు ఉన్నా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత త్రిముఖ పోటీలో పవన్ పాండే విజయం సాధించే అవకాశాలే కనిపించడం లేదని చెప్తున్నారు.

ముస్లింలు ఎటు వైపు...

ముస్లింలు ఎటు వైపు...

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీఎస్పీ నుంచి అదీ నియోజకవర్గంలోనే తొలిసారి ముస్లిం అభ్యర్థి బజ్మీ సిద్ధిఖీ పోటీ చేయడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశమే. నియోజకవర్గంలో 55 వేల నుంచి 60 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లు గంపగుత్తగా ఎవరికి పడితే వారిదే విజయం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా వుందని అది తమకు మళ్లుతుందని బీఎస్పీ విశ్వసిస్తోంది. మాయావతి తమకు భద్రత కల్పిస్తుందని ముస్లింలు విశ్వసిస్తున్నారు. అయోధ్య ఓటర్లు ఎవర్ని గెలిపించనున్నారో మార్చి 11న జరిగే ఓట్ల లెక్కింపులో తేలనుంది. హిందూ, ముస్లింల పర్వదినాలు వచ్చినప్పుడు మత సామరస్యం కోసం బాజ్మీ సిద్ధిఖీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారని స్థానిక ముస్లింలు చెప్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
One of the very few Khatri traders in the local market here, Vardhaman is careful of what he speaks about the Ram Mandir, but he is vocal about one thing: Ayodhya gets attention only on paper and it is the only tourist place with no tourist spot. “Yahan koi videshi nahi aata (no foreign tourist comes here). It is only natural that Ayodhya feels envious of Mathura,” Khatri says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more