వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీ పోల్స్: 85 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా, రాయ్‌బరేలీ నుంచి అదితి సింగ్

|
Google Oneindia TeluguNews

లక్నో: త్వరలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రెండో అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 85 మంది బీజేపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాయ్ బరేలి సదర్ ఎమ్మెల్యే అదితి సింగ్ పేరు కూడా ఉంది.

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ బంధువు, ఎమ్మెల్యే హరి ఓమ్ యాదవ్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఎస్పీని వీడిన ఆయన బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అదితి సింగ్ సిట్టింగ్ సీట్ రాయ్ బరేలి నుంచి పోటీ చేస్తుండగా, హరి ఓమ్ యాదవ్ సిర్సాగంజ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

UP polls 2022: BJPs Second List Of 85 Candidates released, Aditi Singh To Contest From Rae Bareli

కాగా, రాయ్‌బరేలి అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలిలోనే ఉండటం గమనార్హం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నితిన్ అగర్వాల్ సమాజ్ వాదీ పార్టీని వీడి ఇటీవల బీజేపీలో చేరారు. ఆయన హర్దోయి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి అసిమ్ అరుణ్ కు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. రిజర్వుడ్ సీట్ అయిన కన్నౌజ్ నుంచి అసిమ్ అరుణ్ పోటీ చేస్తున్నట్లు జాబితా వెల్లడించింది.

Recommended Video

UP Elections 2022 : Congress Promises 20 lakh Jobs | Congress Youth Manifesto | Oneindia Telugu

ఈ రెండో జాబితాలో 15 మంది మహిళలకు చోటు కల్పించడం గమనార్హం.
403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీకి మధ్య పోరు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన ఓపీనియన్ పోల్స్ మరోసారి బీజేపీ అధికారం చేపడుతుందని స్పష్టం చేస్తున్నాయి. అయితే, గతంలో కంటే బీజేపీకి సీట్లు తక్కువగా వస్తాయని, అఖిలేష్ పార్టీ పుంజుకుంటుందని పేర్కొన్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభావం అంతగా ఉండకపోవచ్చని తెలిపాయి.

English summary
UP polls 2022: BJP's Second List Of 85 Candidates released, Aditi Singh To Contest From Rae Bareli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X