UP poll results: ఆప్ సహా ప్రముఖ పార్టీల కంటే NOTAకే ఓటు షేర్ ఎక్కువ
న్యూఢిల్లీ: ప్రతి ఎన్నికల్లో నోటాకు ఎన్నో కొన్ని ఓట్లు వస్తాయి. కానీ, తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం కొన్ని ప్రముఖ పార్టీల కంటే ఎక్కువగా నోటాకే రావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వరుసగా రెండో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు మద్దతుగా వేసిన ఓట్ల కంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై 'నోటా' ఎంపికకు ఎక్కువ ఓట్లు వచ్చాయి.
భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకారం.. ఎన్నికల్లో నోటా (NOTA-పైన ఏదీ కాదు) ఓట్ల శాతం 0.69 శాతంగా ఉంది, ఇది ఏఏపీ (0.35 శాతం), జేడీయూ(0.11 శాతం) ఓట్ల వాటాను అధిగమించిందని అని పీటీఐ నివేదించింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)కి పోలైన ఓట్లలో 0.47 శాతం ఓట్లు వచ్చాయి.

సీపీఐకి 0.07 శాతం ఓట్లు రాగా, ఎన్సీపీకి 0.05 శాతం ఓట్లు వచ్చాయి. శివసేనకు 0.03 శాతం ఓట్లు వచ్చాయి.
సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్), ఎల్జేపీ(ఆర్వీ)లకు ఒక్కోదానికి 0.01 శాతం ఓట్లు వచ్చాయి.
ECI వెబ్సైట్ ప్రకారం.. AIFB, IUML, LJPలకు ఎలాంటి ఓట్లు రాలేదు, 0 శాతం ఓట్ షేర్ని కలిగి ఉన్నాయి.
బీజేపీ ఓట్ల శాతం 41.6 శాతం కాగా, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి 32 శాతం ఓట్లు వచ్చాయి. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి 12.8 శాతం, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డి)కి 3.02 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఓట్ షేర్ 2.38 శాతం.
2017లో బీజేపీకి 312 సీట్లు వచ్చాయి, దాని మిత్రపక్షాలైన అప్నా దళ్, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP)కి వరుసగా తొమ్మిది, నాలుగు సీట్లు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి 47, బీఎస్పీకి 19, కాంగ్రెస్‌కు 7, ఇతరులకు 5 సీట్లు వచ్చాయి.