కాంగ్రెస్ పార్టీకి షాక్: ప్రియాంక సన్నిహితుడు, సీనియర్ నేత రాకేష్ సచన్ బీజేపీలో చేరిక
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, యూపీ మాజీ ఎమ్మెల్యే రాకేష్ సచన్ బీజేపీలో చేరారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న సచన్, గతంలో సమాజ్‌వాదీ పార్టీ (ఏస్పీ)తో అనుబంధం కలిగి ఉన్నారు.
2009లో ఎస్పీ టిక్కెట్‌పై ఫతేపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో ఏస్పీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొలుత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ ఆ పార్టీని వీడారు. దీని తర్వాత రాకేష్ సచన్ కూడా బీజేపీలో చేరడం గమనార్హం. ఆయన తన భార్యకు టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. బీజేపీ కూడా ఆయన డిమాండ్‌కు అంగీకరించింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న, ఆ పార్టీలో బలమైన వ్యక్తి అయిన రాకేష్ సచ్చన్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల మధ్య ఫిరాయింపుల రాజకీయం నడుస్తోంది. ఫిరాయింపుదారులు యూపీ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చాయి.
ఇప్పటికే అధికార బీజేపీ పార్టీ నుంచి ముగ్గురు మాజీ మంత్రులతోపాటు సుమారు పది మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఎస్పీ నుంచి కూడా పలువురు కీలక నేతలు బీజేపీలో చేరారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి-మార్చిలో ఏడు దశల్లో జరగనున్నాయి.
1వ
దశ:
ఫిబ్రవరి
10
2వ
దశ:
ఫిబ్రవరి
14
3వ
దశ:
ఫిబ్రవరి
20
4వ
దశ:
ఫిబ్రవరి
23
5వ
దశ:
ఫిబ్రవరి
27
6వ
దశ:
మార్చి
3
7వ
దశ:
మార్చి
7
మార్చి
10న
ఎన్నికల
ఫలితాలు
వెలువడనున్నాయి.