వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడేమో స్టార్.. ఇక్కడేమో దొంగతనాలు..!

|
Google Oneindia TeluguNews

లక్నో : అక్కడేమో స్టార్‌గా వెలుగొందుతున్నాడు.. ఇక్కడేమో చోరీలు చేస్తున్నాడు. అద్భుతమైన డ్యాన్సులతో వేలాది మంది అభిమానుల మనసు దోచిన ఆ స్టార్.. ఇళ్లల్లో చొరబడి నగదు గట్రా దోచేస్తున్నాడు. చాలా ఈజీగా చోరీలు చేస్తూ తన స్టార్‌డమ్‌తో పోలీసులకు దొరికిపోను అనుకున్నాడో ఏమో గానీ చివరకు మాత్రం అడ్డంగా బుక్కయ్యాడు.

ఉత్తర ప్రదేశ్ పోలీసులకు టిక్ టాక్ స్టార్ చోరీ కేసులో పట్టుబడటం చర్చానీయాంశంగా మారింది. ఓ దొంగతనం కేసులో అతడిని పట్టుకొచ్చి లోపలేశారు. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా లోని గ్రేటర్ నోయిడాలో ఇటీవల వరుస చోరీలు జరుగుతుండటం పోలీసులకు సవాల్‌గా మారింది. ఏ కోణంలో చూసినా నిందితుల ఆచూకీ దొరక్కపోవడం పోలీసులకు తలనొప్పైంది. దాంతో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించారు. దాంతో టిక్ టాక్ స్టార్ నేతృత్వంలోని దొంగల ముఠా గుట్టు రట్టైంది.

 up tik tok star arrested in robbery cases

క్యాడర్ ఉంది సరే, మరి లీడర్లు.. ఆ కోటలో కమలం పువ్వు వికసించేనా..!క్యాడర్ ఉంది సరే, మరి లీడర్లు.. ఆ కోటలో కమలం పువ్వు వికసించేనా..!

టిక్ టాక్ స్టార్‌గా షారూఖ్ అనే యువకుడు చాలా ఫేమస్ అయ్యాడు. తనకు టిక్ టాక్ యాప్‌లో దాదాపు 40 వేల మంది వరకు ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అతడు చేసే డ్యాన్సులను ఆ యాప్‌లో అప్‌లోడ్ చేస్తూ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే స్టార్‌డమ్ ఉంది కదా.. తాను ఏం చేసినా చెల్లుతుందని అనుకున్నాడో ఏమో గానీ మొత్తానికి చోరీల బాట పట్టాడు. దొంగల ముఠాకు నాయకత్వం వహించి బాగానే దోచినట్లు స్థానిక పోలీసుల ద్వారా తెలుస్తోంది.

 up tik tok star arrested in robbery cases

టిక్ టాక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న షారూఖ్ అడ్డ దారులు తొక్కడం చర్చానీయాంశమైంది. మొత్తానికి పోలీసుల వలకు చిక్కడంతో దొంగగా ముద్రపడి కటకటాలు లెక్కిస్తున్నాడు. వీరి గ్యాంగ్ నుంచి ఒక బైకుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లు, మూడున్నర వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో తన నేరాలను అంగీకరించాడు షారూఖ్. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

English summary
A TikTok star with over 40,000 followers, along with his three accomplices, was arrested by police in connection with robbery cases in Gautam Buddh Nagar district in Greater Noida. The police have also recovered five mobiles, one bike and Rs 3,520 in cash from their possession.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X