• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హిందూ మహాసభ నేత హత్యలో ఉగ్ర కోణం: మహారాష్ట్ర, గుజరాత్ లల్లో దర్యాప్తు: మహిళ పాత్రపై అనుమానాలు

|

లక్నో: హిందూ మహాసభ సీనియర్ నాయకుడు, హిందూ సమాజ్ పార్టీ అధినేత కమలేష్ తివారి హత్యోదంతంపై ఉత్తర్ ప్రదేశ్ అట్టుడుకుతోంది. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టులో తుది విచారణ ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన దారుణ హత్యకు గురయ్యారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందు వల్లే గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. కమలేష్ తివారి హత్యలో ఉగ్రవాదుల కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు తీవ్రవాద నిరోధక దళం (ఏటీఎస్)తో సంప్రదింపులు చేపట్టింది.

కమలేష్ తివారి హత్య వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఉండే అవకాశాలు లేకపోలేదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. తివారి హత్యో దంతానికి సంబంధించిన మూలాలు మహారాష్ట్ర, గుజరాత్ లల్లో ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో- ఆ రెండు రాష్ట్రాల్లోని ఏటీఎస్ అధికారుల సహకారాన్ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు తీసుకోవచ్చని సమాచారం. ఇప్పటికే రెండు బృందాలను గుజరాత్, మహారాష్ట్రలకు పంపించినట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

UP Top Cop On Kamlesh Tiwaris Killing, Spoken To Woman In CCTV Footage

లక్నోలోని ఖుర్షీద్ బాగ్ ప్రాంతంలోని హిందూ సమాజ్ పార్టీ కార్యాలయం ఆవరణలో అమర్చిన సీసీటీవీ కెమెరా ఫుటేజీల్లో కనిపించిన మహిళ నేపథ్యాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. కమలేష్ తివారిని హత్య చేసినట్టుగా భావిస్తోన్న ఇద్దరు యువకులతో పాటు ఆ మహిళ కూడా సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించారు. వారితో మాట్లాడటం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. ఆ ఇద్దరు హంతకులతో పాటు ఆ మహిళ కూడా హత్యకు సహకరించి ఉండొచ్చనే పోలీసులు భావిస్తున్నారు. ఆమెను గుర్తించిన పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. విచారించారు.

ఏపీలో ఆ ఉద్యోగుల సేవలు రద్దు: నెలాఖరులోగా తొలిగించండి: ప్రభుత్వ నిర్ణయం వెనుక..!

కమలేష్ తివారీ హత్య వెనుక ఆమె పాత్ర ఉందనడానికి సరైన సాక్ష్యాధారాలు లభించలేదని సమాచారం. ఆ మహిళను అదుపులోకి తీసుకున్న తరువాత విచారణను పర్యవేక్షించడానికి డీజీపీ ఓపీ సింగ్ స్వయంగా పోలీస్ స్టేషన్ కు రావడం ఈ హత్యోదంతానికి సంబంధించిన కేసు తీవ్రతను స్పష్టం చేస్తోంది. కాగా- తన తండ్రి హత్య కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని కమలేష్ తివారి కుమారుడు సత్యం తివారి డిమాండ్ చేస్తున్నారు. తన తండ్రికి సెక్యూరిటీ గార్డులతో భద్రత కల్పించినప్పటికీ.. సొంత కార్యాలయంలోనే హత్యకు గురయ్యారని, తాము ఎవ్వర్నీ నమ్మే పరిస్థితుల్లే లేమని అంటున్నారు.

స్థానిక నాయకుల పాత్రపైనా అనుమానాలు..

కమలేష్ తివారి హత్యోదంతంలో ఆయన తల్లి చెబుతున్న వాదనలు దీన్నంతటికీ భిన్నంగా ఉంటున్నాయి. తన కుమారుడిని స్థానిక రాజకీయ నాయకులే పొట్టన పెట్టుకుని ఉంటారని కమలేష్ తివారి తల్లి కుసుమ్ తివారి ఆరోపించారు. కొన్ని భూ ఆక్రమణలను తన కుమారుడు అడ్డుకున్నాడని, ఆ కక్షతోనే స్థానిక రాజకీయ నాయకులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు సుపారీ ఇచ్చి, హత్య చేయించి ఉంటారని ఆమె చెబుతున్నారు.

కాగా- కమలేష్ తివారి హత్య కేసులో బిజ్నౌర్ జిల్లాకు చెందిన ఓ ముస్లిం నాయకుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. మౌలానా మొహసిన్ షేక్, రషీద్ అహ్మద్ పఠాన్, ఫైజాన్ అనే ముగ్గురు యువకులపైనా కేసు నమోదైంది. ఈ ముగ్గురూ గుజరాత్ కు చెందిన వారే. ఈ ముగ్గురిలో రషీద్ అహ్మద్ పఠాన్.. కమలేష్ తివారి హత్య కేసులో మాస్టర్ మైండ్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
The woman seen on CCTV footage from outside the home of Kamlesh Tiwari was inspected by Uttar Pradesh Police, they spoke to the woman. Speaking to reporters on Saturday night, OP Singh, Director-General of Police (UP) also said the state had reached out to Anti-Terrorism Squads in Gujarat and Maharashtra to follow up on more clues and evidence. The woman in question had earlier been identified as one of three possible suspects in the killing of the Hindu Samaj Party chief, along with two men both of whom are still on the run.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more