వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ అవులను చంపినా.. మద్యం అమ్మినా.. అమ్మాయిలు ఫోన్ మాట్లాడినా ‘ఫైన్’!

ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఉన్న ఓ గ్రామం వినూత్న నిబంధనలు తీసుకొచ్చింది. ఆవులను చంపినా, మద్యం అమ్మకాలు చేపట్టినా, మహిళలు వీధుల్లో ఫోన్‌ వాడినా భారీగా జరిమానా విధించనుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఉన్న ఓ గ్రామం వినూత్న నిబంధనలు తీసుకొచ్చింది. ఆవులను చంపినా, మద్యం అమ్మకాలు చేపట్టినా, మహిళలు వీధుల్లో ఫోన్‌ వాడినా భారీ జరిమానాలు విధించేలా మడోరా గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు గ్రామ పంచాయతీ బుధవారం సంబంధిత ఆదేశాలు జారీచేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. అమ్మాయిలు వీధుల్లో నడుస్తూ ఫోన్‌ మాట్లాడినట్లు కన్పిస్తే వారికి రూ. 21వేల జరిమానా విధించనున్నారు.

UP village to fine girls for using mobiles on the street

మహిళలపై నేరాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇక, గోవధకు పాల్పడినా.. ఆవులను దొంగతనం చేసినా రూ. 2 లక్షల వరకు జరిమానా విధించనున్నారు.

ఎవరైనా మద్యం అమ్మకాలు చేపడితే.. వారు రూ. 1.11 లక్షల వరకు అపరాధ రుసుము చెల్లంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. జరిమానాలతో పాటు అవసరమైతే శిక్షలు కూడా విధిస్తారట. ఎలాంటి శిక్ష విధించాలన్న విషయంలో పంచాయతీనే నిర్ణయం తీసుకుంటుందట. చూద్దాం.. ఇలా కఠినంగా వ్యవహరిస్తేనన్నా నేరాలు ఘోరాలు తగ్గుతాయేమో!

English summary
The Panchayat of Madora village in Uttar Pradesh's Mathura district on Wednesday decided to penalise girls who use mobiles while walking on the street. The Panchayat members decided a fine of ₹21,000 on such girls in order to reduce the rate of crime against girls and elopement. Apart from the penalty, the Panchayat would also decide a requisite punishment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X