వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'చిప్స్ ప్యాకెట్' కోసం ఇలానా!.. భార్యకు భర్త ఊహించని షాక్?

భర్త తీసుకొచ్చిన చిప్స్ ప్యాకెట్స్ లో ఒకదానిని బాధితురాలు ఆమె తల్లిదండ్రులకు ఇచ్చింది. చిప్స్ ప్యాకెట్ తన అత్తమామలకు ఇవ్వడం సహించని సదరు భర్త.. ఏకంగా 'తలాక్ తలాక్ తలాక్' అంటూ ఆమెకు విడాకులిచ్చేశాడు.

|
Google Oneindia TeluguNews

లక్నో: ముస్లిం మహిళల జీవితాలను దుర్భరం చేసేలా ట్రిపుల్ తలాక్ సాంప్రదాయం దుర్వినియోగం అవుతుందన్న చర్చ ప్రస్తుతం దేశంలో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్చ ఇలా తెరపై ఉండగానే.. 'ట్రిపుల్ తలాక్'లతో ముస్లిం మహిళలు రోడ్డున పడుతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటుండటం గమనార్హం.

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కవినగర్ కు ప్రాంతానికి చెందిన ఓ దంపతులకు చిప్స్ ప్యాకెట్ విషయంలో గొడవ తలెత్తి.. అది కాస్త ట్రిపుల్ తలాక్ దాకా వెళ్లింది. బాధిత మహిళ ఆదివారం నాడు స్థానిక ఎమ్మెల్యేను కలిసి సహాయం చేయాల్సిందిగా కోరడంతో.. ఈ విషయం వెలుగుచూసింది.

UP woman given triple talaq for giving a ‘namkeen’ packet to her parents

వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్ జిల్లాలోని కవినగర్‌ ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళకు తన ఇంటి పక్కనే ఉండే ముస్లిం వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం తర్వాత కొన్నాళ్ల పాటు వైవాహిక జీవితం బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్న చిన్న సమస్యలు తలెత్తడం మొదలయ్యాయి.

ఇదే క్రమంలో శనివారం నాడు చిప్స్ ప్యాకెట్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. ఆరోజు రాత్రి రెండు చిప్ ప్యాకెట్స్ తీసుకుని భర్త ఇంటికి వచ్చాడు. భర్త తీసుకొచ్చిన చిప్స్ ప్యాకెట్స్ లో ఒకదానిని భార్య ఆమె తల్లిదండ్రులకు ఇచ్చింది. చిప్స్ ప్యాకెట్ తన అత్తమామలకు ఇవ్వడం సహించని సదరు భర్త.. ఏకంగా 'తలాక్ తలాక్ తలాక్' అంటూ ఆమెకు విడాకులిచ్చేశాడు.

చిన్నపాటి సమస్యకే భర్త విడాకుల నిర్ణయం తీసుకోవడంతో.. బాధితురాలికి ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలను కలిసి సహాయం చేయాల్సిందిగా కోరింది.

English summary
A 26-year-old woman met Uttar Pradesh minister of state for food and supplies Atul Garg on Sunday and alleged that she was subjected to ‘triple talaq’ by her husband over a trivial matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X