వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త అతి ప్రేమ తట్టుకోలేకపోతున్నా... విడాకులు ఇప్పించండి... ఓ భార్య విచిత్ర కేసు...

|
Google Oneindia TeluguNews

భర్త వేధిస్తున్నాడనో... వ్యసనాలకు బానిసయ్యాడనో... కుటుంబాన్ని పట్టించుకోవడం లేదనో.... ఇలా రకరకాల కారణాలతో భార్యలు విడాకులు కోరే కేసులు చూసుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ మహిళ మాత్రం విచిత్రమైన కారణంతో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. తన భర్త అతి ప్రేమను తట్టుకోలేకపోతున్నానని... ఏడాదిన్నర కాపురంలో ఏనాడూ తనతో తగువుకు దిగలేదని పేర్కొంటూ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది.

Illegal love: అక్రమ సంబంధం, ప్రియుడితో భార్య స్కెచ్, ఫ్రెండ్స్ తో భర్త రివర్స్ స్కెచ్, క్లైమాక్స్! Illegal love: అక్రమ సంబంధం, ప్రియుడితో భార్య స్కెచ్, ఫ్రెండ్స్ తో భర్త రివర్స్ స్కెచ్, క్లైమాక్స్!

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

ఉత్తరప్రదేశ్‌లోని సంబల్‌ జిల్లాకు చెందిన మహిళ షరియా కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. 18 నెలల క్రితం తనకు వివాహమైందని... అప్పటినుంచి తన భర్త అతి ప్రేమతో విసుగు చెందానని ఆమె పిటిషన్‌లో పేర్కొంది. ఇన్నాళ్ల కాపురంలో ఏనాడు తన భర్త తనతో గొడవ పడలేదని చెప్పింది. అంతేకాదు,వంట పనిలో,ఇంటి పనిలో ప్రతీ దాంట్లో తనకు చాలా సహకరించేవాడని పేర్కొంది. ఎన్నడూ తనపై కనీసం అరిచింది కూడా లేదని... ఏ విషయంలోనూ తనను బాధపెట్టలేదని చెప్పుకొచ్చింది. ఆయన ప్రేమ తనకు ఊపిరి సలపనివ్వకుండా చేస్తోందని... అలాంటి మనిషితో తాను ఉండలేనని కోర్టుకు విన్నవించుకుంది.

అతనితో ఉండలేను....

అతనితో ఉండలేను....

'నేనేదైనా తప్పు చేసినా... అతను పోనీలే అని చాలా తేలిగ్గా మన్నిస్తాడు. కానీ నాకేమో భర్తతో వాదించాలని ఉంటుంది. కానీ అతను ఆ ఛాన్స్ ఇవ్వడు.' అని పిటిషన్‌లో ఆమె పేర్కొంది. తాను ఏం చేసినా అంగీకరించే భర్తతో తాను ఉండాలనుకోవడం లేదని చెప్పింది. అయితే ఆమె పిటిషన్‌ను షరియా కోర్టు మతాధికారి తిరస్కరించారు. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను అంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు.

పెద్ద మనుషులు కూడా చేతులెత్తేశారు....

పెద్ద మనుషులు కూడా చేతులెత్తేశారు....

పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు కాకుండా మరే ఇతర కారణాలైనా ఉన్నాయా అని షరియా కోర్టు ఆమెను ఆరా తీసింది. అందుకు ఆమె లేవనే బదులిచ్చింది. దీంతో పిటిషన్‌ను విచారించేందుకు ఆ మతాధికారి తిరస్కరించారు. ఆ తర్వాత ఆమె గ్రామ పెద్దలను కూడా సంప్రదించి పంచాయితీ నిర్వహించింది. కానీ పెద్ద మనుషులు కూడా ఆమె సమస్యకు పరిష్కారం చెప్పలేకపోయారు.

Recommended Video

COVID-19 Cases Cross 1 Lakh Mark In Telangana తెలంగాణ గ్రేటర్ పరిధిలో మళ్లీ పెరుగుతున్న కేసులు!!
భర్త ఏమంటున్నాడు....

భర్త ఏమంటున్నాడు....

ఈ వ్యవహారంపై ఆమె భర్త స్పందిస్తూ... 'నాకు తెలిసి నేనెప్పుడూ ఆమెను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టలేదు. ఆమెను ఎప్పుడూ సంతోషంగా చూసుకోవాలని.. పర్ఫెక్ట్‌ భర్తగా ఉండాలని భావించాను.' అని చెప్పుకొచ్చాడు. ఈ సమస్యను మీరిద్దరే పరిష్కరించుకోవాలని షరియా కోర్టు భార్యాభర్తలను ఆదేశించింది. ఇప్పుడు భార్యకు ఎలా నచ్చజెప్పాలో తెలియక అతను సతమతమవుతున్నాడు. భర్త మిస్టర్ పర్ఫెక్ట్ అయితే సంతోషించాలి గానీ... ఇలా విడాకులు కోరడమేంటని దీని గురించి తెలిసిన జనం చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఈ కేసు చాలామందిని నోరెళ్లబెట్టేలా చేసింది.

English summary
A woman in Sambhal district of Uttar Pradesh has sought a divorce from her husband just 18 months after her marriage. She has approached the Sharia court in Sambhal to seek a divorce, leaving the court puzzled. Why? Her husband loves her too much and does not fight with her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X