వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే రెండుసార్లు ఐపీఎల్‌ను కాంగ్రెస్ మరొక దేశానికి తరలించింది: మోడీ

|
Google Oneindia TeluguNews

రాజస్థాన్ : యూపీఏ హయాంలో ఐపీఎల్‌ను ఆ ప్రభుత్వం వేరే దేశానికి తరలించిందని తమ ప్రభుత్వంలో ఐపీఎల్, ఎన్నికలు రెండు ఒకేసారి నిర్వహించగలుగుతున్నామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. రాజస్థాన్‌లోని కరౌలీ సభలో మాట్లాడిన ప్రధాని యువతకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ క్రికెట్ టోర్నీని నాడు ఎన్నికల నెపంతో దక్షిణాఫ్రికాకు తరలించిందని గుర్తు చేశారు. భద్రతపై నాటి యూపీఏ ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వలేకపోయిందని అన్నారు. అలా 2009లో 2014లో కూడా ఎన్నికల పేరు చెప్పి దక్షిణాఫ్రికాకు మెగా టోర్నీని తరలించిందని ధ్వజమెత్తారు ప్రధాని మోడీ.

దేశ భద్రతపై ఓ సభలో మాట్లాడిన మోడీ యూపీఏ ప్రభుత్వానికి ఉగ్రవాదాన్ని అణిచివేసే ధైర్యం లేకపోయిందన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి అదే సమయంలో ఐపీఎల్ టోర్నీ కూడా జరుగుతోంది. వీటితో పాటు నవరాత్రి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి కూడా వచ్చాయి. మరికొద్దిరోజుల్లో రంజాన్ కూడా వస్తుంది... అయినప్పటికీ ఎక్కడా భద్రతపై వెనక్కు తగ్గలేదని అన్నిటికీ తగిన భద్రతను కల్పించామని మోడీ అన్నారు. అప్పటి ప్రభుత్వం భయంతో వ్యవహరించింది. కానీ మోడీకి భయం అంటే తెలియదు అని అన్నారు.

UPA scared of terrorists,thats why IPL was shifted twice says Modi

భద్రతాకారణాలతో 2009లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. నాడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్‌లకు తగినంత భద్రత కల్పించలేకపోతున్నామంటూ నాటి ఎన్నికల సంఘం . దీంతో ఇటు ఎన్నికలు, అటు మ్యాచ్‌లకు భద్రత కల్పించాలంటే కష్టతరమవుతోందని చెప్పడంతో ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాకు మార్చారు.

English summary
With the IPL and general elections going on in the country simultaneously, PM Narendra Modi has hit out at the Congress saying they couldn't ensure security and shifted "India's favourite" tournament out of the country on two occasions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X