వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీరం దాటిన అంపన్‌ తుఫాను...170 కిలోమీటర్ల వేగంతో.. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

|
Google Oneindia TeluguNews

బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా ఏర్పడిన ఎంఫాన్ (Amphan) తుఫాన్ సూపర్ సైక్లోన్‌గా రూపాంతరం చెందింది. తీర ప్రాంతాలపై విరుచుకుపడబోతోంది. మన రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర సహా మూడు రాష్ట్రాలను గజగజమంటూ వణికిస్తోంది. ఊహించిన దాని కంటే ఈ తుఫాన్ తీవ్రత అధికంగా ఉందని, పెను విధ్వంసాన్ని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని భారత వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంచనాలకు మించి ఈ తుఫాన్ బలోపేతమైందని వెల్లడించారు. దీనికి ఇదివరకు ఆంఫన్ (Umpun)గా పేరుపెట్టారు.

Upman super cyclone alert: potential to cause heavy damage,here are the live updates

బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశగా ఏర్పడిన ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 190 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలోని ఉత్తరాంధ్రపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని వెల్లడించారు. ఒడిశాలోని కేంద్రపారా, పశ్చిమ బెంగాల్‌లోని దిఘా పట్టణం మధ్య తుఫాన్ తీరం దాటడానికి అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. తుఫాన్ తన దిశను మార్చుకునే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో కల్లోలాన్ని మిగిల్చవచ్చని వెల్లడించారు.

Newest First Oldest First
9:13 AM, 22 May

నేడు ఆంఫన్ తుఫాను ప్రాంతాలైన బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో ప్రధాని ఏరియల్ సర్వే. ఢిల్లీ నుంచి బెంగాల్‌కు బయలుదేరిని ప్రధాని మోడీ
8:55 AM, 22 May

ఆంఫన్ తుఫాన్

ఆంఫన్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న కోల్‌కత విమానాశ్రయంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
8:43 AM, 22 May

ఆంఫన్ తుఫాన్

తుఫాన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న పశ్చిమ బెంగాల్ తీర ప్రాంత జిల్లాల్లో కొనసాగుతోన్న సహాయక చర్యలు
8:04 AM, 22 May

ఆంఫన్ తుఫాన్

ఆంఫన్ తుఫాన్ బారిన పడి భారీ నష్టాన్ని చవి చూసిన పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 83 రోజుల తరువాత తొలిసారిగా పర్యటనలకు వెళ్లనున్నారు
1:06 AM, 22 May

ఒడిశా,బెంగాల్‌లో అంఫన్ తుఫాన్ సృష్టించిన విలయం తనను కలచివేస్తోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తుఫాన్ ధాటికి మృత్యువాతపడ్డ వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు.
12:23 AM, 22 May

అంఫన్ తుఫాన్ కారణంగా పశ్చిమ బెంగాల్‌తో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో తమ బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడిందని బంధన్ బ్యాంకు వెల్లడించింది. దాదాపు రూ.260కోట్ల లావాదేవీలపై ప్రభావం పడిందని తెలిపింది.
11:01 PM, 21 May

అంఫన్ తుఫాన్ విలయానికి కోల్‌కతాలో 19 మంది మృత్యువాత పడినట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు.
9:58 PM, 21 May

అంఫన్ తుఫాన్ ధాటికి విలవిల్లాడుతున్న పశ్చిమ బెంగాల్,ఒడిశా రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
8:18 PM, 21 May

అంఫన్ తుఫాన్ ధాటికి కోల్‌కతాలోని తమ ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్టు కిందకు ఒరిగిపోయిందని భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ గంగూలీ ట్విట్టర్‌లో తెలిపారు. ఆ చెట్టును తిరిగి పూర్వ స్థితిలో నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఫోటోలు తీసి ట్విట్టర్‌లో పెట్టారు.
8:15 PM, 21 May

అంఫన్ తుఫాన్ ధాటికి ఒడిశాలో 44.8లక్షల మంది ప్రజలు ప్రభావితమైనట్టు ప్రభుత్వం అంచనా వేసింది.
7:04 PM, 21 May

ఒడిషా చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్ నిర్వహించి తుఫాను తర్వాత చేపడుతున్న పనులపై సమీక్ష నిర్వహించిన కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా
6:50 PM, 21 May

ఒడిషా

ఆంఫన్ తుఫాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
5:34 PM, 21 May

ఒడిషా పశ్చిమ బెంగాల్‌లో నష్టం ఏమేరకు జరిగిందనేదానిపై అంచనా వేసేందుకు కేంద్ర బృందం పర్యటిస్తుంది:ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ప్రధాన్
4:28 PM, 21 May

పశ్చిమబెంగాల్

ఆంఫన్ తుఫాను వల్ల మృతి చెందిన కుటుంబాలకు రూ.2.5 లక్షలు పరిహారం ఇస్తాం:సీఎం మమతా బెనర్జీ
3:55 PM, 21 May

బెంగాల్

మొత్తం 72 మందిని పొట్టనబెట్టుకున్న ఆంఫన్ తుఫాను. ఇందులో 12 మంది కోల్‌కతాకు చెందినవారని ప్రకటించిన సీఎం మమత బెనర్జీ
2:26 PM, 21 May

ఆంషన్ తుఫాను పై సమీక్ష చేస్తున్నాం. బెంగాల్ ఒడిషా ప్రజలు ధైర్యంగా ఉండాలి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ప్రజలకు సహాయం చేస్తున్నాయి: హోంశాఖ మంత్రి అమిత్ షా
2:25 PM, 21 May

బెంగాల్‌లో ఆంఫన్ తుఫాను సృష్టించిన బీభత్సాన్ని వివిధ మాధ్యమాల ద్వారా చూశాను. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది: ప్రధాని మోడీ
1:54 PM, 21 May

పశ్చిమబెంగాల్

హౌరా జిల్లాలోని కితియాపాడ హార్పబ్‌లో తుఫాను సృష్టించిన బీభత్సం. నీట మునిగిన కోచ్ యార్డ్
12:46 PM, 21 May

ఆంఫన్‌ ఎఫెక్ట్: కోల్‌కతా విమానాశ్రయంలోకి భారీగా చేరిన వర్షపు నీరు
11:26 AM, 21 May

ఆంఫన్ తుఫాను సృష్టించిన బీభత్సంకు నిదర్శనం కోల్‌కతాలోని ఈ ఎయిర్‌పోర్టు. కోల్‌కతా విమానాశ్రయంలో నిలిచిపోయిన వర్షపు నీరు
11:24 AM, 21 May

ఒడిషా

బాలాసోర్ జిల్లాలో ఓ ఇంటిపై పడిపోయిన చెట్లును తొలగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. తుపాన్ సృష్టించి బీభత్సానికి ఇలా చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి.
10:27 AM, 21 May

బంగ్లాదేశ్ వైపు కదులుతున్న ఆంఫన్ తుఫాను. అస్సాం మేఘాలయాలకు భారీ వర్ష సూచన. పశ్చిమ బెంగాల్‌లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి: భారత వాతావరణ శాఖ
8:53 AM, 21 May

బంగ్లాదేశ్-పశ్చిమ బెంగాల్ తీరాలను అతలాకుతలం చేసిన ఆంఫన్ తుఫాను ఆ తర్వాత ఉత్తరం దిశగా ఈశాన్య వైపు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇలా కదిలి రానున్న మూడు గంటల్లో తుఫాను బలహీనపడే అవకాశం ఉంది: ఐఎండీ
8:51 AM, 21 May

కోల్‌కతా

కోల్‌కతాలో ఆంఫన్ తుఫాను సృష్టించిన బీభత్సం. చెట్లను, బస్సులను, ఇతర వాహనాలను తుఫాను ధాటికి ధ్వంసమయ్యాయి
7:59 AM, 21 May

ఆంపన్ తుఫాన్

కోల్‌కత వీధుల్లో నిలిచిపోయిన వర్షపు నీరు. నేల కూలిన చెట్లు. పలు వాహనాలు ధ్వంసం
7:26 AM, 21 May

ఆంపన్ తుఫాన్

ఆంపన్ తుఫాన్ ధాటికి పశ్చిమ బెంగాల్‌లో 10 మంది మృతి
7:19 AM, 21 May

ఆంపన్ తుఫాన్

తుఫాన్ ధాటిని కోల్‌కతలో నేలకూలిన చెట్లను తొలగిస్తోన్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు. కోల్‌కతపై తుఫాన్ పెను ప్రభావాన్ని చూపింది.
6:54 AM, 21 May

అంపన్ తుఫాన్

ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో కొనసాగుతున్న ఆంపన్ తుఫాన్ సహాయక చర్యలు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన సిబ్బంది
6:16 AM, 21 May

ఆంపన్ తుఫాన్ ఎఫెక్ట్

ఆంపన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్‌పై పెను ప్రభావాన్ని చూపింది. అతి భారీ వర్షాల వల్ల కోల్‌కత వీధులు జలమయం అయ్యాయి. నాలుగు అడుగుల ఎత్తు నీళ్లు నిల్చిపోయాయి. భీకర గాలులకు హౌరా బ్రిడ్జిపైన అమర్చిన బ్యారికేడ్లు ఎగిరిపడ్డాయి
1:14 AM, 21 May

ఎంఫాన్ తుఫాన్ ధాటికి రాష్ట్రంలో ఇప్పటివరకూ 10-12 మంది మృత్యువాత పడి ఉండవచ్చునని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తీర ప్రాంతం వెంబడి దాదాపు 6.5లక్షల మందిని ఖాళీ చేయించినట్టు తెలిపారు.
READ MORE

English summary
As the Umpun cyclone is ready to hit three states, the three state govts are geared up for the preparedness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X