వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హవ్వ.. స్కూల్‌లో వర్ణ వివక్ష... దళిత విద్యార్థులపై చిన్నచూపు....

|
Google Oneindia TeluguNews

బాలియా : దేశంలో కులవివక్ష జాఢ్యం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఎక్కడో ఓ చోట అణగారిన వర్గాలపై వివక్ష చూపిస్తూనే ఉన్నారు. అప్పర్ క్యాస్ట్‌కు చెందిన వారు అణగారిన వర్గాలను చిన్నచూపు చూస్తున్నారు. అంతేందుకు చిన్న కులాల వారు భోజనం చేసిన పాత్రలను కూడా ముట్టుకోవడం లేదు. తామే సొంతంగా ప్లేట్స్ తెచ్చుకుంటున్న ఘటన కలకలం రేపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సమయంలో .. దళిత విద్యార్థులు వాడిన ప్లేట్లను అగ్రవర్ణాల వారు వాడటం లేదు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

కశ్మీర్‌కు సీతారాం ఏచూరి.. స్నేహితుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా ...కశ్మీర్‌కు సీతారాం ఏచూరి.. స్నేహితుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా ...

యూపీలో బాలియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుకుంటున్నారు. అక్కడ మద్యాహ్న భోజన పథకం అమలవుతుంది. అయితే దళితులు, అగ్రవర్ణాల విద్యార్థులు ఉన్నారు. దీంతో పాఠశాల అందజేస్తున్న ప్లేట్లను దళిత విద్యార్థులు వాడుతుండగా .. బీసీ, ఓసీ కులాలకు చెందిన విద్యార్థులు మాత్రం తాము సొంతంగా ప్లేట్లను తీసుకొస్తున్నారు. ఇలా తినే సమయంలో చూపే వివక్షకు సంబంధించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలైంది.

Upper Caste Students At UP School Bring Own Plates, Mayawati Condemns It

దీనిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ భవాని సింగ్ స్పందించారు. ఇవాళ ఉదయం పాఠశాలను సందర్శించారు. ఏం జరిగిందని ఆరాతీశారు. పాఠశాలలో దళితులపై వివక్ష చూపడం సరికాదన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని మేజిస్ట్రేట్ స్థాయి అధికారిని ఆదేశించారు. అయితే పాఠశాలలో అగ్రవర్ణాలకు చెందిన కొందరు విద్యార్థులకు కుల వివక్ష చూపిస్తున్నారని ప్రిన్సిపల్ పురుషోత్తం గుప్తా తెలిపారు. దళితులపై వివక్ష చూపడంపై బీఎస్పీ చీఫ్ మాయావతి ఖండించారు. ఈ వార్త వినడం చాలా ఇబ్బందిగా ఉంది అని పేర్కొన్నారు. పాఠశాలలో వివక్షపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అగ్రకులాల వారు స్కూల్‌లో జాత్యాంహకారంతో ప్రవర్తించడం సరికాదన్నారు. అలా ప్రవర్తించిన వారికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.

English summary
A video supposedly showing Dalit students eating mid-day meals separately from other students at a primary school in Uttar Pradesh's has gone viral following which an inquiry has been ordered into the incident. The video also shows that general and backward caste students bring their own utensils and do not have their meals in plates provided by the school as Dalit students use them. Taking note of the video, District Magistrate Dr Bhawani Singh Khangaraut visited the school on Thursday morning to take stock of the situation. Bahujan Samaj Party president Mayawati took to Twitter to express concern over the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X