వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీపై గల్లా తీవ్రవ్యాఖ్య, నిర్మల ఆగ్రహం: కాంగ్రెస్‌తో కలిసి.. దులిపేసిన ఎంపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఇది ఆధిక్యతకు, నైతికతకు మధ్య జరుగుతున్న యుద్ధం : గల్లా జయదేవ్

న్యూఢిల్లీ: అవిశ్వాసం తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ప్రధానిని మోసగాడు అని అర్థం వచ్చేలా మాట్లాడారు. దీనిపై బీజేపీ ఎంపీలు తీవ్ర నిరసన తెలిపారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ టీడీపీని దులిపేశారు.

అవిశ్వాసం.. లోకసభలో టీఆర్ఎస్ వర్సెస్ టీడీపీఅవిశ్వాసం.. లోకసభలో టీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ

ప్రధాని మోడీని మోసగాడు అని అర్థం వచ్చేలా గల్లా మాట్లాడారు. దీనిపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే స్పందించారు. టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మోసగాడు అన్న పదంపై బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. పరిశీలించి దానిని తొలగిస్తామని స్పీకర్ తెలిపారు.

Uproar in Lok Sabha after BJP MPs protest over offensive word used by a TDP MP for PM Modi

ఆ తర్వాత బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో చాలాసార్లు అవిశ్వాసం పెట్టారని గుర్తు చేశారు. కానీ విభజన సమయంలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు టీడీపీ చేతులు కలిపిందన్నారు. వీరిద్దరు కలిసి అవిశ్వాస తీర్మానం తేవడం విడ్డూరమని అభిప్రాయపడ్డారు.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారంలో కాంగ్రెస్, టీడీపీ సాన్నిహిత్యాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ప్రజల నమ్మకం, విశ్వాసం కోల్పోయిన పార్టీలను తీసుకు వచ్చి అవిశ్వాసం పెట్టారన్నారు. పరస్పర విరుద్ధ భావాలు, సిద్ధాంతాలు కలిగిన పార్టీలు (టీడీపీ, కాంగ్రెస్) కలిసి అవిశ్వాసంపై ఏకమయ్యాయన్నారు. అసలు అవిశ్వాసం ఉద్దేశ్యం ఏమిటని దేశ ప్రజలంతా చూస్తున్నారన్నారు.

English summary
Uproar in Lok Sabha after BJP MPs protest over offensive word used by a TDP MP for PM Modi. Defence Minister Nirmala Sitharaman demands that the word be expunged from records. The Speaker says she would go through it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X