వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

UPSC Civil Services 2019: సివిల్స్ ఫలితాలు విడుదల.. టాపర్‌‌గా ప్రదీప్ సింగ్

|
Google Oneindia TeluguNews

కేంద్ర సర్వీసుల ఉద్యోగాల భర్తీకి పరీక్ష నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా 2019 సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించి ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా అందులో సెలెక్ట్ అయినవారికి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆగష్టు వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక ఇంటర్వ్యూ ఫలితాలతో పాటు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను మెరిట్ ఆధారంగా విడుదల చేసింది కమిషన్.

ఇందులో ముఖ్యంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్‌తో పాటు ఇతర కేంద్ర సర్వీసుల్లో గ్రూప్ ఏ, గ్రూప్ బీ పోస్టులకు మెరిట్ ఆధారంగా భర్తీ చేయడం జరుగుతుంది. ఈ సారి అంటే 2019 మెయిన్స్ పరీక్షల్లో ప్రదీప్ సింగ్ టాపర్‌గా నిలువగా జతిన్ కిషోర్ , ప్రతిభా వర్మలు వరుసగా రెండో ర్యాంకు మూడో ర్యాంకు సాధించారు. మొత్తం 829 మంది అభ్యర్థులు వారి రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేయబడ్డారు. ఇందులో జనరల్ కేటగిరీ కింద 304 మంది , ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీలో 78మంది, ఓబీసీ అభ్యర్థులు 251, ఎస్సీ 129 మంది, ఎస్టీలో 67 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు.

UPSC releases Civil services 2019 final result

Recommended Video

IAS Officer Submits Fake OBC Certificate | చిక్కుల్లో Kerala IAS || Oneindia Telugu

ఇదిలా ఉంటే ఐఏఎస్‌ పోస్టులు 180 ఉండగా అందులో జనరల్ కేటగిరీలో 72, ఈడబ్ల్యూఎస్ 18, ఓబీసీ 52, ఎస్సీ 25, ఎస్టీకి 13 పోస్టులు ఉన్నాయి. ఐఎఫ్ఎస్‌కు 24 పోస్టులు ఖాళీగా ఉండగా జనరల్ కేటగిరీలో 12 ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 6, ఎస్సీ 3, ఎస్టీ 1 పోస్టు ఉంది. ఇక ఐపీఎస్‌లో జనరల్ కేటగిరీకి 60 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌కు 15 పోస్టులు, ఓబీసీకి 42 పోస్టులు , ఎస్సీకి 23 పోస్టులు ఎస్టీకి 10 పోస్టులు ఉండగా మొత్తం పోస్టుల సంఖ్య 150గా ఉన్నాయి.

English summary
UPSC announces the final result 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X