వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్తీ అరెస్టుపై మల్లగుల్లాలు.. లోక్‌పాల్‌పై ప్రధాని ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ వ్యవహారశైలి సరిగా లేదంటూ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో లోక్‌పాల్ ఏర్పాటుపై సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ ప్రధాని పంపిన ఆహ్వానంపై ఖర్గే అసహనం వ్యక్తం చేశారు. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం అరెస్టుపై ఇప్పటికే మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ నేతలు 'అత్తమీద కోపం దుత్తమీద చూపించిన' చందాన వ్యవహరిస్తున్నారు.

నిబంధనల ప్రకారం.. లోక్‌పాల్ ఏర్పాటు సమావేశానికి ప్రధాని, లోక్‌సభ స్పీకర్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తో పాటు అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత కూడా హాజరుకావాలి. కానీ బుధవారం నాటి లోక్‌పాల్ సమావేశానికి తాము హాజరుకావడం లేదని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ఖర్గే ప్రధానికి లేఖ రాశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశానికి హాజరుకావాలంటూ వచ్చిన ఆహ్వానంపై ఖర్గే ఆగ్రహానికి లోనయ్యారు.

Upset Congress Skips Lokpal Meet, Urges "Statesman-Like Conduct" From PM Modi

ప్రధానమంత్రి ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని ఆయన రాసిన లేఖలో ఆరోపించారు. 'అవినీతి నిర్మూలన కోసం కేంద్రం లోక్‌పాల్‌ను నియమించాలనుకుంటోంది. కానీ అయిదేళ్లుగా ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రధాని ఓ రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించడం మంచిది..' అని ఆ లేఖలో ఖర్గే అభిప్రాయపడ్డారు.

రాజకీయ కుయుక్తితోనే ప్రధాని మోడీ తమకు సరైన విధంగా ఆహ్వానాన్ని పంపలేదని మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. కేవలం సుప్రీంకోర్టును సంతృప్తిపరిచేందుకే ఈ లోక్‌పాల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. అభిప్రాయ నమోదు, ఓటింగ్ హక్కులాంటివి లేకుండా సమావేశంలో పాల్గొనడం అనేది లోక్‌పాల్ ఎంపికలో వ్యతిరేకతను మినహాయించడానికి చేసిన ప్రయత్నమేనని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

వాస్తవానికి గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 44 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దీంతో ఆ పార్టీకి అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కలేదు. అయితే నిబంధనల ప్రకారం.. లోక్‌పాల్ నియామకం కోసం ప్యానల్‌లో ప్రతిపక్ష నేత కూడా ఉండి తీరాలి. ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాల మేరకు చట్టంలో సవరణ చేస్తూ.. కాంగ్రెస్‌కు ఆహ్వానం పంపారు. అయితే ఆ ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడంతో లోక్‌పాల్ నియామకం అనిశ్చితిగా మారింది.

English summary
A top committee including Prime Minister Narendra Modi and the Chief Justice of India, meets today on the appointment of an anti-corruption Lokpal but the main opposition Congress has refused to be a part of it, objecting to "special invitee" status in the meeting. "A more apt and statesman-like conduct is expected from the prime minister of the country," Congress leader Mallikarjun Kharge has written in a sharp letter to PM Modi, refusing the invitation. "My mere presence as special invitee without rights of participation, recording of my opinion and voting would be a mere eyewash ostensibly aimed at showcasing the participation of the opposition in the selection process," he says, calling the 'Special Invitee Invitation' a concerted effort to exclude the opposition from the selection process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X