కొడుకు కంటే కుక్కే నయం .. పెంపుడు కుక్కకు ఆస్తి రాసిన రైతు .. ఆ తర్వాత ఏం జరిగిందంటే
కొడుకు ప్రవర్తనతో కలత చెందిన ఓ తండ్రి తన ఆస్తి వారికి దక్కకూడదని అనుకున్నాడు. అలా అనుకున్న ఆ తండ్రి ఇతరుల పేరు మీద ఆస్తి రాశాడు అనుకుంటే పొరపాటే, ఏ అనాధాశ్రమానికో ఇచ్చాడు అనుకున్నా మీరు తప్పులో కాలేసినట్టే. కొడుకు మీద కోపంతో ఓ తండ్రి తన ఆస్తిలో సగభాగం తన కుక్క పేరుమీద వీలునామా చేయడం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

టన్నెల్ ఎఫైర్ ... ప్రేయసి కోసం సొరంగమే తవ్విన ప్రియుడు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మొగుడు

తన ఆస్తిలో కొంత కుక్కకు వీలునామా రాసిన రైతు
మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో నివసిస్తున్న ఒక వృద్ధుడు తన కొడుకుల ప్రవర్తనతో కలత చెందడంతో తన ఆస్తిలో సగం తన కుక్కకు రాసిచ్చాడు . రైతుగా జీవనం సాగించే ఓం నారాయణ వర్మ అనే వ్యక్తి, తన వద్ద ఉన్న పెంపుడు కుక్క తన కొడుకు లాంటిదని, తన ఆలనా పాలనా అది చూస్తుందని, అందుకే తన ఆస్తిలో సగం కుక్కకు రాశానని పేర్కొన్నారు. చింద్వారా జిల్లా బరబర కు చెందిన 50 ఏళ్ల ఓం నారాయణ వరకు 18 ఎకరాల పొలం ఉంది. అయితే ఆయన కుమారుడితో గొడవ కారణంగా కొడుకుపై విసిగిపోయాడు ..

తనని జాగ్రత్తగా చూసుకునే కుక్కకు , తన భార్యకే ఆస్తి చెందాలని వీలునామా
తన పెంపుడు కుక్క అయిన జాకీ పేరు మీద కొంత ఆస్తిని రాసి , మిగతా భూమిని తన రెండవ భార్య చంపాకు రాసిచ్చాడు.
తనని జాగ్రత్తగా చూసుకుంటుంది తన భార్య మరియు నా పెంపుడు కుక్క మాత్రమేనని పేర్కొన్నాడు. తాను చనిపోయిన తరువాత తన ఆస్తిని వీరిద్దరూ వారసత్వంగా పొందాలని నేను కోరుకుంటున్నాను అంటూ వీలునామా రాశారు. ఇక కుక్కను జాగ్రత్తగా చూసుకున్న వారు ఆ కుక్క కు కేటాయించిన ఆస్తి వారసత్వంగా పొందుతారని ఆ వీలునామాలో పేర్కొన్నారు.

కొడుకు విషయంలో రైతు నిర్ణయం వైరల్ .. సముదాయించిన గ్రామ సర్పంచ్
అయితే ఈ విషయం తెలిసిన గ్రామ సర్పంచ్ ఓం నారాయణ వర్మని పిలిచి సముదాయించడం తో ఆ వీలునామాను వెనక్కి తీసుకున్నారు సదరు రైతు. ఏదేమైనా తల్లిదండ్రుల పట్ల పిల్లలు ప్రేమను చూపించుకుంటే, వారి బాగోగులు చూసుకుంటే, తల్లిదండ్రులు ఆస్తులు వారసత్వంగా ఇచ్చే విషయంలో తమ అసహనాన్ని ప్రదర్శిస్తారని అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కుక్కకు ఆస్తిని వీలునామా రాసి ఓం నారాయణ తీసుకున్న నిర్ణయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలిసిన వారు కుక్క కున్న విశ్వాసం కూడా కొడుకులకు ఉండటం లేదంటూ ఈ ఘటనపై తెగ చర్చిస్తున్నారు.