వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్యులపై దాడి చేస్తే జైలే: ఏడేళ్ల వరకు, రూ.5 లక్షల ఫైన్, నాన్ బెయిలబుల్ కేసు: కేంద్రం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ రక్కసి జడలువిప్పి నాట్యం చేస్తుంటే ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యం అందిస్తోన్న సిబ్బంది రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైద్య సిబ్బంది/ క్లినిక్‌పై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఘటన తీవ్రతను బట్టి ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని స్పష్టంచేశారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరించారు.

ఉపేక్షించం..

ఉపేక్షించం..

వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. వైద్య సిబ్బంది రక్షణ కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలిపింది.ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 చట్టానికి సవరణలు చేస్తామని పేర్కొన్నారు. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్రతో అమల్లోకి రానుంది. వైద్యుల రక్షణకు భరోసా లభిస్తోందని చెప్పారు. వైద్యులు.. ఆశా కార్యకర్త నుంచి వైద్యుడి భద్రతకు కట్టుబడి ఉన్నామని ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్రమంత్రులు అమిత్ షా, హర్షవర్థన్ వైద్యులతో మాట్లాడారని గుర్తుచేశారు.

రెండింతల జరిమానా..

రెండింతల జరిమానా..

క్లినిక్‌పై దాడి చేస్తే రెండింతల జరిమానా ముక్కుపిండి మరీ వసూల్ చేస్తామని జవదేకర్ పేర్కొన్నారు. వైద్యులపై దాడి చేస్తే నాన్ బెయిలబుల్ వారెంట్ కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. కేసు తీవ్రతను బట్టి 3 నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధించేలా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. వైద్యులపై దాడి తీవ్రత ఉంటే లక్ష రూ.5 లక్షల జరిమానా.. ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించేలా చర్యలు తీసుకుంటానమి చెప్పారు. దాడిచేసిన వారికి సంబంధించి 30 రోజుల్లో విచారణ పూర్తిచేసి, ఏడాదిలోపు జైలుశిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

50 లక్షల బీమా

50 లక్షల బీమా

విధుల్లో ఉన్న సిబ్బందికి రూ.50 లక్షల వరకు జీవిత భీమా అందిస్తామని కేంద్రమంత్రి జవదేకర్ పేర్కొన్నారు. దేశంలో 735 కోవిడ్ ఆస్పత్రుల్లో రోగులకు చికిత్సను అందిస్తున్నారని పేర్కొన్నారు. వైద్యులకు సంబంధించి పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌ల కొరత లేదని తేల్చిచెప్పారు. 90 లక్షల ఎన్ 95 మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

Recommended Video

Tested Negative People And States Situation After ICMR Advises Not to Use Rapid Testing Kits

English summary
central government on Wednesday brought in an ordinance under which any person who attacks a health worker who is treating Covid-19 cases can be jailed for a maximum of seven years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X