వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా మాయ : కిరాణ షాపులకు మహర్దశ.. యూత్‌ డేటింగ్ స్పాట్ కూడా అక్కడే..

|
Google Oneindia TeluguNews

గత పదేళ్ల కాలంలో భారత్‌లోని పట్టణ,నగరవాసులు నిత్యావసరాలు,కిరాణ వస్తువుల కోసం ఎక్కువగా మాల్స్ పైనే ఆధారపడుతూ వస్తున్నారు. మొదట్లో కేవలం మెట్రో నగరాలకు,బీ గ్రేడ్ నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ కల్చర్.. నెమ్మదిగా పట్టణాలకు కూడా వ్యాపించింది. డీమార్ట్,వాల్ మార్ట్,బిగ్ బజార్,స్పెన్సర్స్ తదితర మాల్స్,సూపర్ మార్కెట్స్ ఉన్నత వర్గాలతో పాటు మద్యతరగతి వర్గాలను కూడా ఎక్కువగా ఆకర్షిస్తూ వచ్చాయి. దీంతో పట్టణాలు,నగరాల్లో ఇంటి సమీపంలో ఉండే కిరాణ దుకాణానికి వెళ్లేవారి కంటే మాల్స్‌కు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ కరోనా దెబ్బకు ఇప్పుడంతా తలకిందులైపోయింది. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా కొన్ని మాల్స్ మూతపడటం.. డీమార్ట్ లాంటివి తెరుస్తున్నా.. చాలాచోట్ల నిత్యావసరాలకు 3కి.మీకి మించి వెళ్లవద్దన్న నిబంధనలు ఉండటంతో.. ఎక్కువమంది కిరాణ షాపుల వైపు చూస్తున్న పరిస్థితి.

ఆశ్చర్యపోతున్న కిరాణ యజమానులు..

ఆశ్చర్యపోతున్న కిరాణ యజమానులు..


లాక్ డౌన్ కారణంగా నిన్న మొన్నటిదాకా ఇంటి పక్కనే ఉన్న కిరాణ షాపు ముఖం కూడా చూడనివాళ్లు ఇప్పుడు రోజూ అక్కడికే వెళ్తున్నారు. గతంలో అడపాదడపా అక్కడికి వెళ్లినా.. ఎప్పుడూ వారితో మాట్లాడటానికి అంతగా ఆసక్తి కనబరచనివారు.. ఇప్పుడు 'భయ్యా అది తెప్పించరా.. ఇది తెప్పించరా..' అంటూ వారిని సున్నితంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ మార్పుకు కిరాణ యజమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఢిల్లీకి చెందిన ఓ కిరాణ యజమాని ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ దీనిపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.' మా ఏరియాలో ఉండే సంపన్నులు,ఉన్నత వర్గాల వాళ్లు మునుపెన్నడూ మా షాపుకు రాలేదు. ఏది కావాలనుకున్నా.. కార్లలో మాల్స్‌కు వెళ్లి తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు వాళ్లంతా మా షాపుకు వస్తున్నారు..' అని చెప్పాడు.

నిన్నటిదాకా అలా.. ఇప్పుడు పరిస్థితిలా..

నిన్నటిదాకా అలా.. ఇప్పుడు పరిస్థితిలా..

గతంలో ఎప్పుడైనా దారి తప్పి వాళ్లు కిరాణ షాపుకు వచ్చినా.. తమతో పెద్దగా మాట్లాడకపోయేవారని చెప్పాడు. కానీ ఇప్పుడు షాప్‌కి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడుతున్నారని అన్నాడు. మాల్స్‌తో పోల్చితే కిరాణ షాపుల్లో ఫ్రెష్ స్టాక్ ఉండదని భావించే వాళ్లు సైతం.. ఇప్పుడు తామిచ్చే వస్తువులపై ఎక్స్పైరీ డేట్ కూడా చూడకుండానే కొనుగోలు చేస్తున్నారని కొందరు యజమానులు అభిప్రాయపడుతున్నారు. ఖరీదైన చాక్లెట్ల దగ్గరి నుంచి బ్యూటీ ప్రొడక్ట్స్ వరకు ప్రతీది తమవద్దే కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు, ఏదైనా వారికి కావాల్సిన వస్తువు షాపులో లేకపోతే.. 'కాస్త అవి తెప్పించరా..' అని సున్నితంగా రిక్వెస్ట్ చేస్తున్నారని చెబుతున్నారు.

గతం కంటే పుంజుకున్న కిరాణ వ్యాపారాలు

గతం కంటే పుంజుకున్న కిరాణ వ్యాపారాలు

ఎప్పుడూ హడావుడిగా.. వెళ్లగానే పనైపోవాలి అన్నట్టుగా వ్యవహరించే అర్బన్ మిడిల్ క్లాస్ కిరాణ షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ బాక్సుల్లో నిలుచుంటున్నారని కిరాణ యజమానులు చెబుతున్నారు. అటు కస్టమర్స్‌లోనూ కొంత మార్పు కనిపిస్తోంది. లాక్ డౌన్ వేళ ఎక్కడికో వెళ్లి వస్తువులను కొని తెచ్చుకోవడం కంటే.. ఇంటి సమీపంలోని కిరాణ షాపుకు వెళ్లడమే మంచిదని అంటున్నారు. తద్వారా వైరస్ వ్యాప్తిని కొంతలో కొంతైనా నియంత్రించవచ్చునని చెబుతున్నారు. ఈ మార్పు కిరాణ షాపు యజమానులకు సంతోషాన్నిస్తోంది. లాక్ డౌన్ పీరియడ్‌లో వారి వ్యాపారాలు గతం కంటే పుంజుకున్నాయి. కొంతమంది కిరాణ యజమానులు షాపు ఎదుటే కూరగాయలు కూడా అమ్ముతుండటంతో.. ఒకే చోట రెండు పనులు పూర్తి చేసుకోవచ్చునని కస్టమర్స్ అటువైపు వెళ్తున్నారు.

డేటింగ్ స్పాట్..

డేటింగ్ స్పాట్..


సాధారణ రోజుల్లో యువతీ యుకులు కలిసేందుకు కెఫేలు,థియేటర్స్,మాల్స్ ఇతరత్రా అడ్డాలు చాలానే ఉండేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో కొంతమంది కుర్రకారు తమ కాలనీలో ఉండే గర్ల్ ఫ్రెండ్స్ లేదా బాయ్ ఫ్రెండ్స్‌ను కలిసేందుకు.. మాట్లాడేందుకు.. కిరాణ షాపులనే అడ్డాగా మార్చుకుంటున్నారు. ఎక్కువసేపు కాకపోయినా.. ఏదో పొడి పొడి ముచ్చట్లతో అలా సంతృప్తి చెందుతున్నారు. సాధారణ రోజుల్లో యువతీ యువకులు పెద్దగా తమ షాపులకు వచ్చేవారు కాదని.. కానీ ఇప్పుడు వాళ్లకిదో స్పాట్‌గా మారిపోయిందని కిరాణ యజమానులు కూడా చెబుతున్నారు.

Recommended Video

India Lockdown 2.0 : KCR To Take A Key Decision On April 20th Over Coronavirus Lockdown

English summary
After lock down in India almost of all shopping malls were closed.Even though grocery malls like Dmart are open,due to the restrictions people instead going to near by kirana shops in their area. After a decade that urban middle class adopted mall culture,this kind of situation is arised first time so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X