• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాఫ్ట్ పోర్న్‌స్టార్: ఊర్మిళా మతోండ్కర్‌పై కంగనా ఫైర్: తల కోసుకుంటా గానీ: సన్నీలియోన్‌నూ

|

ముంబై: బాలీవుడ్ ఒక్కసారిగా వేడెక్కింది. ఆ వేడి కాస్తా పీక్‌కు చేరుకుంటోంది. ప్రముఖ నటి ఊర్మిళా మతోండ్కర్‌పై బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం పుట్టించాయి. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసు వ్యవహారంలో ఇప్పటికే బేజారెత్తిపోతోన్న బీ-టౌన్‌ను.. తాజాగా కంగనా చేసిన కామెంట్స్ మరింత ఠారెత్తిస్తున్నాయి. కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ అనంతరం ఓ రకంగా బాలీవుడ్ సెలెబ్రిటీలు రెండుగా విడిపోయినట్లుగా కనిపిస్తోంది. ఈ వార్‌లో ఊర్మిళ మతోండ్కర్ వైపు పలువురు సెలెబ్రిటీలు మొగ్గు చూపారు.

బీజేపీకి మిత్రపక్షం షాక్: మోడీ సర్కార్ చర్యలకు నిరసన: ఆ బిల్లులకు వ్యతిరేకంగా ఎందాకైనా

ఆ కామెంట్స్ ఏంటీ?

ఆ కామెంట్స్ ఏంటీ?

ఊర్మిళా మతోండ్కర్‌ను సాఫ్ట్ పోర్న్‌స్టార్‌గా అభివర్ణించారు కంగనా. ఓ ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. ఆమెకు తాను కట్టుబడి ఉన్నాననీ చెప్పారు. అవే వ్యాఖ్యలను తన అధికారిక ట్విట్టర్‌లోనూ కంగనా రనౌత్ పోస్ట్ చేశారు. ఊర్మిళా మతోండ్కర్ వంటి ఓ సాఫ్ట్ పోర్న్‌స్టార్ తనను తప్పు పట్టడం సరికాదని కంగనా చెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని, అయినప్పటికీ.. దోషిగా చూస్తున్నారంటూ విమర్శించారు. ముంబైలోని తన మణికర్ణిక ఫిల్మ్స్ కార్యాలయ భవనాన్ని కూల్చివేయడాన్ని తప్పు పట్టారు.

వివాదాలకు కారణం..

ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌గా పేర్కొంటూ కంగనా చేసిన వ్యాఖ్యల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఊర్మిళ మతోండ్కర్‌కు అసహనానికి గురి చేశాయి. ముంబైని కించపరిచేలా ఆమె కామెంట్స్ చేశారని, దానికి తగిన శిక్షను అనుభవించాల్సి ఉంటుందనీ హెచ్చరించారు. రాజ్యసభలో జయాబచ్చన్ చేసిన ప్రకటనల పట్ల కంగనా రనౌత్ తప్పుపట్టడం పట్ల కూడా ఊర్మిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన కంగనా రనౌత్ నోటి వెంట నుంచే మాటలు ఆమె స్థాయిని తగ్గిస్తున్నాయని అన్నారు. ఆమె స్థాయి ఏమిటో తెలియజేస్తున్నాయని విమర్శించారు.

ఫేక్ ఫెమినిస్టులు..

ఊర్మిళపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతించట్లేదనే విషయాన్ని కంగనా రనౌత్ మరోసారి స్పష్టం చేశారు. న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను మళ్లీ తన ట్విట్టర్‌లోనూ పోస్ట్ చేయడం దీనికి నిదర్శనం. మాజీ పోర్న్‌స్టార్‌ను సన్నీలియోన్‌ పేరును కంగనా ప్రస్తావించారు. తమను తాము ఫెమినిస్టులుగా, లిబరల్ బ్రిగేడ్‌గా చెప్పుకొంటోన్న వారు సన్నీలియోన్ తమకు రోల్ మోడల్ కాదని ఆమెను కించపరిచారని కంగనా పేర్కొన్నారు. సన్నీ లియోన్‌ పోర్న్‌స్టార్ కాదని, ఆమెను ఓ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్ అంగీకరించిందని చెప్పారు. సడన్‌గా పోర్న్‌స్టార్‌గా ఉన్నవారు ఫేక్ ఫెమినిస్టులు పుట్టుకొచ్చారని విమర్శించారు.

తల కోసుకుంటా గానీ..

తల కోసుకుంటా గానీ..

తాను క్షత్రియురాలినని , తల కోసుకుంటా గానీ.. ఎక్కడా తల వంచే ప్రసక్తే లేదని కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. దేశం కోసం ఎప్పుడూ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు. ఆత్మ గౌరవంతో జీవిస్తున్నానని, ఆత్మాభిమానాన్ని తాను పోగొట్టుకోలేనని వ్యాఖ్యానించారు. ఓ జాతీయవాదిగా తాను సగర్వంగా తల ఎత్తుకుని జీవిస్తానని అన్నారు. దేనికోసమో తాను తన సిద్ధాంతాలతో రాజీపడబోనని అన్నారు.

వేశ్యగా అభివర్ణించినప్పుడు ఏమయ్యారు?

ఊర్మిళ మతోండ్కర్ తనను రుడాలిగా, వేశ్యగా అభివర్ణించినప్పుడు ఈ ఫెమినిస్టులందరూ ఏమయ్యారని కంగనా రనౌత్ ప్రశ్నించారు. ఇలాంటి ఫేక్ ఫెమినిస్టుల వల్ల మహిళలు తల దించుకోవాల్సి వస్తోందని విమర్శించారు. రేప్ అనేది కేవలం రెండు శరీరాల కలయిక కాదనే విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. సాఫ్ట్ పోర్న్‌స్టార్ వ్యాఖ్యల అనంతరం కంగనాకు ప్రతికూల పరిస్థితులు బాలీవుడ్‌లో ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. స్వరా భాస్కర్, పూజాభట్, ఫరాఖాన్ వంటి కొందరు సెలెబ్రిటీలు ఊర్మిళకు మద్దతుగా నిల్చున్నారు.

English summary
Swara Bhasker, Pooja Bhatt, Farah Khan Ali extend support to Urmila Matondkar, after Kangana Ranaut calls her a ‘soft porn star’Bollywood celebrities have come out in support of Urmila Matondkar, after Kangana Ranaut tagged her as a ‘soft porn star’ in a recent interview.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X