వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నటి ఊర్మిళ ...!

|
Google Oneindia TeluguNews

ఇటివల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమిపాలైన ప్రముఖ నటీ ఊర్మీళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేశారు. ముంబయి నగర పార్టీలో కొనసాగుతున్న పార్టీ అంతర్గత విషయాల వల్లే ఆమే పార్టీ నుండి వైదొలుగుతున్నట్టు ఆమే ప్రకటించారు. పార్టీకి దూరంగా ఉంటాను తప్ప రాజీకీయాలను వదలి వెళ్లనని ఆమే స్పష్టం చేశారు.

ఎంత తేడా? చంద్రయాన్-2 ఖర్చు రూ. 978 కోట్లు: వైట్ టాపింగ్ రోడ్ల వ్యయం రూ.986 కోట్లు!ఎంత తేడా? చంద్రయాన్-2 ఖర్చు రూ. 978 కోట్లు: వైట్ టాపింగ్ రోడ్ల వ్యయం రూ.986 కోట్లు!

ఆమే ప్రముఖ నటి ఇటివలే జాతీయ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆవేంటనే జరిగిన లో‌క్‌సభ ఎన్నికల్లో ముంబయి నార్త్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసింది. అయితే తన సమీప అభ్యర్థి అయిన బీజేపీ సీనియర్ నాయకుడు అయిన గోపాల్ శేట్టిలో చేతిలో దారుణంగా ఓటమిపాలయింది. కాగా ఆయన నాలుగు లక్షల యాబైవేల ఓట్ల తేడాతో గెలుపొందారు.

 Urmila Matondkar has resigned from the Congress

అయితే ముంబయిసిటి ఇంచార్జ్ అయిన మిలింద్ డియోరాకు ఆమేకు మధ్య రాజకీయ వైరుధ్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఆయనపై పలు ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే తాను ఎన్నికల్లో ఓడిపోయినా ఏనాడు ఓటమి బాధను దరి చేరనీయలేదని చెప్పారు.దీంతో తాను పార్టీని వీడుతున్నానని అయితే రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండడని స్పష్టం చేశారు.

కాగా రానున్న కొద్ది రోజుల్లోనే మహారాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలోనే మరోసారి రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ముంబాయిలో కాంగ్రెస్‌తోపాటు శరద్ పవర్‌ను దెబ్బకొట్టేందుకు బీజేపీ ఇప్పటి నుండే పావులు కదుపుతున్నట్టు సమాచారం. సినిమా కళకారులతోపాటు ఇతర సలబ్రెటీలను బీజేపీ ఇటివల ఎక్కువ ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే ఊర్మిళ తాను రాజకీయాలకు దూరంగా ఉండడని ప్రకటించిన ఆమే ఏపార్టీ వైపు మొగ్గుచూపుతుందో వేచిచూడాలి.

English summary
Urmila Matondkar has resigned from the Congress citing concerns over "petty in-house politics" within the Mumbai unit of the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X