వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర మండలికి ఊర్మిళ..? అభ్యర్థిత్వంపై ఉద్దవ్ ఎస్.. ప్రకటించడమే తరువాయి.. ఒక్కో పార్టీ నుంచి..

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర ప్రభుత్వం 12 మందికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించనుంది. ఇక్కడ శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఒక్కో పార్టీ నుంచి నలుగురికి అవకాశం ఇస్తారు. అయితే అందులో ఊర్మిళ మంటోడ్కర్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని శివసేన అధికార ప్రతినిధి, ముఖ్యనేత సంజయ్ రౌత్ తెలిపారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ది ఆత్మహత్యా ? హత్యా ? ఏం తేల్చారు . సీబీఐ కి మహారాష్ట్ర హోం మంత్రి ప్రశ్నలుసుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ది ఆత్మహత్యా ? హత్యా ? ఏం తేల్చారు . సీబీఐ కి మహారాష్ట్ర హోం మంత్రి ప్రశ్నలు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్ల భర్తీపై గురువారం మంత్రివర్గ సమావేశం జరిగింది. అందులో 12 మందిపై నిర్ణయించింది. అభ్యర్థుల వివరాలు సీఎం వద్ద ఉన్నాయని.. ఆయన నిర్ణయం మేరకు గవర్నర్ మండలికి 12 మంది అభ్యర్థులను నియమిస్తారని వివరించారు. నటి ఊర్మిళ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముంబై నార్త్ నుంచి లోక్ సభకు పోటీ చేశారు. అయితే ఓడిపోవడంతో.. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు. వారు సహకరించకపోవడం వల్లే తాను ఓడిపోయానని చెప్పారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడారు.

Urmila Matondkar To Be Nominated As Maharashtra Lawmaker?

అయితే ఇటీవల ముంబైని పీవోకే అని కంగనా రనౌత్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని ఊర్మిళ బాహాటంగా వ్యతిరేకించారు. దీంతో శివసేనకు దగ్గరయ్యారు. అందుకే ఉద్దవ్ థాకరే.. తన పార్టీ నుంచి నలుగురిలో ఊర్మిళకు అవకాశం ఇచ్చి ఉంటారు. సాహిత్యం, కళలు, శాస్త్ర, సాంకేతిక రంగాలు, సామాజిక సేవ చేసిన వారిని మండలికి నామినేట్ చేస్తారు. 12 మందిలో ఊర్మిళతోపాటు ఆదాశ్ భండేకర్, ఆనంద్ షిండే, ఎన్సీపీ నేత ఏఖ్‌నాథ్ షిండే పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

English summary
Actor Urmila Matondkar may be recommended by the Shiv Sena-led Maharashtra government for the state legislative council.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X