వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి: లండన్‌లో ఆకస్మిక ల్యాండింగ్

ఎయిర్ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఓ పక్షి ఢీకొనడంతో విమానాన్ని వెంటనే ల్యాండ్ చేశారు. అహ్మాదాబాద్ నుంచి లండ‌న్ వెళ్తున్న విమానానికి ఈ ఘటన చోటుచేసుకుంది.

|
Google Oneindia TeluguNews

లండన్: ఎయిర్ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఓ పక్షి ఢీకొనడంతో విమానాన్ని వెంటనే ల్యాండ్ చేశారు. అహ్మాదాబాద్ నుంచి లండ‌న్ వెళ్తున్న విమానానికి ఈ ఘటన చోటుచేసుకుంది.

లండ‌న్‌లోని హీత్రూ విమానాశ్ర‌యంలో విమానం దించారు. ప‌క్షి ఢీకొన‌డంతో విమానం ముక్కు భాగం లోప‌లికి వెళ్లిపోయింది. దీంతో పాటు ఆ విమానానికి చెందిన రాడార్ వ్య‌వ‌స్థ కూడా దెబ్బ‌తింది. వాస్త‌వానికి ఎయిర్ ఇండియా విమానం అహ్మాదాబాద్ నుంచి అమెరికాలోని నెవార్క్ వెళ్లాల్సి ఉంది.

US-bound AI flight lands in London after bird hit

అయితే లండ‌న్‌లో ఈ విమానం నిలిచిపోవ‌డంతో ప్ర‌యాణికుల‌కు ఎయిర్ ఇండియా ప్ర‌త్యామ్నాయ ఏర్పాటు చేసింది. బుధ‌వారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ఆ విమానంలో సుమారు 230 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం విమానానికి రిపేర్ జరుగుతోందని, లండన్ నుంచి ప్రయాణికులను అహ్మదాబాద్ తీసుకొస్తుందని అధికారులు తెలిపారు.

English summary
National carrier Air India on Thursday said its Ahmedabad-London-Newark flight was grounded in London after a bird hit the aircraft.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X