బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

US election 2020: మోడీని నమ్ముకుంటే ట్రంప్ కు టవలే మిగిలేది, మాజీ సీఎం చిలక జోస్యం !

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/ బెంగళూరు/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రస్తుత ఆదేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అధ్యక్ష పదవి దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న బైడెన్ నువ్వానేనా అంటూ వైట్ హౌస్ పీటం దక్కించుకోవాలని ఎదురు చూస్తున్నారు. అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆటలు ఇక సాగవని, ట్రంప్ కచ్చితంగా ఓడిపోతారని, ట్రంప్ కు చివరికి మిగిలేది టవల్ మాత్రమే అని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రేస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య జోస్యం చెప్పారు. తన అంచనాలు ఇంత వరకు తారుమారు కాలేదని, ఇక మోడీ, ట్రంప్ శకం ముగిసినట్లే అని మాజీ సీఎం సిద్దరామయ్య చిలక జోస్యం చెప్పారు.

US election 2020: న్యూయార్క్ లో హైఅలర్ట్, ఎవడిగోళవాడిది, చీటీ చినిగిపోకుండా ముందు జాగ్రత్తలు !US election 2020: న్యూయార్క్ లో హైఅలర్ట్, ఎవడిగోళవాడిది, చీటీ చినిగిపోకుండా ముందు జాగ్రత్తలు !

ట్రంప్ చేసిన తప్పు అదే

ట్రంప్ చేసిన తప్పు అదే

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం మైసూరులో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో, పేరు వాడుకుని అమెరికాలో స్థిరపడిన భారతీయుల ఓట్లు సంపాధించాలని ప్రయత్నించారని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో వాడుకుని ట్రంప్ చాల పెద్ద పొరపాటు చేశారని మాజీ సీఎం సిద్దరామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.

 మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ?

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ?

అమెరికాలోని భారతీయులు నరేంద్ర మోడీ ఫోటో చూసి, మోడీ పేరు విని ట్రంప్ కు ఓట్లు వేస్తారా ? అది జరిగే పనేనా ? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ? అని మాజీ సీఎం సిద్దరామయ్య వ్యవంగంగా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా జనాభిప్రాయం అమెరికాలో ఇప్పుడే మొదలైయ్యింది, త్వరలో భారత్ లో కూడా ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తాయి, ఆ రోజులు దగ్గరల్లోనే ఉన్నాయని మాజీ సీఎం సిద్దరామయ్య జోస్యం చెప్పారు.

 దేశాన్ని నాశనం చేసిన మోడీ

దేశాన్ని నాశనం చేసిన మోడీ

భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం కావడానికి ప్రధాని నరేంద్ర మోడీ వైఖరే కారణం అని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. భారతదేశంలో యువతకు ప్రధాని మోడీ అన్యాయం చేశారని సిద్దరామయ్య ఆరోపించారు. జీడీపీ పాతాళానికి పడిపోయిందని, అందుకే యువత మోడీని చూస్తే మండిపడుతోందని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.

 సీఎంకు ఉల్లిపాయల రుచి

సీఎంకు ఉల్లిపాయల రుచి

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడిగినందుకు ఉల్లిపాయలు (ఎర్రగడ్డలు)ల రుచిచూపించారని, అది ఆయన మీద ఉన్న కోపం కాదని, కేవలం ప్రధాని నరేంద్ర మోడీ మీద ఉన్న వ్యతిరేకతను ప్రజలు ఆ రూపంలో చూపించారని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. శుక్రవారం రోజు ట్రంప్, మోడీ ప్రజల ముందుకు వచ్చి ఏం చెబుతారో నేను, మీరు చూస్తారు కదా అని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వ్యంగంగా అన్నారు. మొత్తం మీద ట్రంప్ ఓడిపోతారని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య చిలక జోస్యం చెప్పడంతో ప్రజలు షాక్ కు గురైనారు.

English summary
US election 2020: Prime Minister Modi's name does not works in America. Siddaramaiah expressed confidence that President Donald Trump will certainly suffer defeat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X