వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధ్యక్ష ఎన్నికల వేళ..అనూహ్యంగా: ఢిల్లీకి ట్రంప్ కేబినెట్ మంత్రులు: చైనా చుట్టూ చక్రబంధం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకున్న వేళ.. పోలింగ్ గడువు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులు భారత పర్యటనకు బయలుదేరి రానున్నారు. ఈ సాయంత్రానికి వారు దేశ రాజధానికి చేరుకోనున్నారు. అమెరికా కేబినెట్‌లో అత్యంత కీలకమైన విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలకు వారిద్దరూ ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. మంగళవారం భారత్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనబోతున్నారు. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలతో పాటు చైనా దూకుడుకు కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన అంశాలు.. ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

భారత విదేశాంగ, రక్షణ మంత్రులతో..

అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్.. భారత పర్యటనకు రానున్నారు. ఇప్పటికే వారు అమెరికా నుంచి బయలుదేరారు. మంగళవారం దేశ రాజధానిలో వారిద్దరూ రక్షణశాఖ మంత్రులు సుబ్రహ్మణ్యం జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్‌లతో సమావేశం కానున్నారు. 2 + 2 విధానంలో వారి మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభం కానున్నాయి. భారత పర్యటనను ముగించుకున్న అనంతరం వారు శ్రీలంక, మాల్దీవులు, ఇండొనేషియా పర్యటనకు బయలుదేరి వెళ్తారు.

 చైనా చుట్టూ చక్రబంధం..

చైనా చుట్టూ చక్రబంధం..

శతృవుకి శతృవు..మిత్రుడు అనే బేసిక్ ఫార్ములాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది అమెరికా. ఆ శతృవే.. చైనా. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద తరచూ వివాదాలకు పాల్పడుతూ భారత్‌పై కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఆకాశాన్నంటాయి. ఒక దశలో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపించింది. చైనా అంటే.. అమెరికాకూ పడదు. అందుకే భారత్‌ సహా దక్షిణాసియా దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ.. చైనా చుట్టూ చక్రబంధాన్ని ఏర్పరచాలనే లక్ష్యంతో అమెరికా పనిచేస్తున్నట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనే..

ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనే..


భారత్-అమెరికా విదేశాంగ, రక్షణశాఖ మంత్రుల మధ్య జరిగే ఈ ద్వైపాక్షిక చర్చల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చకు వస్తాయని ఇదివరకే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా శాఖల మంత్రుల మధ్య వేర్వేరు సందర్భాల్లో..విభిన్న వేదికలపై ద్వైపాక్షిక చర్చలు ఏర్పాటు కావడం ఇది మూడోసారి. ఈ సారి న్యూఢిల్లీ వేదికగా జరిగే ఈ చర్చల్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ కొద్దిరోజుల కిందటే వెల్లడించారు. రక్షణశాఖపరంగా కొన్ని ఒప్పందాలు కూడా కుదిరే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

Recommended Video

US Election 2020 : H1B ఉద్యోగాల బిజినెస్‌ వీసాల పై ట్రంప్ కీలక నిర్ణయం! || Oneindia Telugu
అధ్యక్ష ఎన్నికల వేళ..

అధ్యక్ష ఎన్నికల వేళ..

ఒకవంక అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోలాహలం కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మైక్ పాంపియో, మార్క్ టీ ఎస్పర్.. భారత్ సహా శ్రీలంక, మాల్దీవులు, ఇండొనేషియా పర్యటనలకు బయలుదేరి రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటన ద్వారా భారత్‌ ముప్పుగా పరిణమించిన చైనాను టార్గెట్‌గా చేసుకోవడం ద్వారా తమ దేశంలో స్థిరపడిన ప్రవాస భారతీయుల ఓటుబ్యాంకును ప్రభావితం చేయడానికి అవకాశం ఉందనే వాదనలు ఉన్నాయి. దీన్ని అనురాగ్ శ్రీవాస్తవ కొట్టిపారేశారు. ముందుగా నిర్దేశించుకున్న కేలండర్ ప్రకారమే.. వారిద్దరూ భారత పర్యటనకు వస్తున్నట్లు చెప్పారు.

English summary
US Secretary of State Mike Pompeo and Defence Secretary Mark T Esper will arrive in New Delhi on Monday for the two-plus-two ministerial dialogue scheduled to be held on Tuesday. Miinisterial dialogue which is taking place just a week ahead of the United States presidential election scheduled on November 3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X