వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

US election results .. ఇండియాలో ఆసక్తి ... పూరీ గోల్డెన్ బీచ్ లో ట్రంప్ , జో బైడెన్ ల సైకత శిల్పం

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా ఇండియాలోనూ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఒక్కసారిగా మార్కెట్ దూకుడు చూపించింది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఇండియన్స్ అమెరికా ఎన్నికలపై ప్రభావం చూపిస్తారన్న విషయం తెలిసిందే . ఈ నేపధ్యంలో ఇండియాలోనూ అమెరికా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది .

US election results .. ఫ్లోరిడాలో తలక్రిందులైన అంచనాలు .. జార్జియా, ఒహైయోలోనూ ట్రంప్ ముందంజ US election results .. ఫ్లోరిడాలో తలక్రిందులైన అంచనాలు .. జార్జియా, ఒహైయోలోనూ ట్రంప్ ముందంజ

అమెరికా ఎన్నికలపై ఇండియాలోనూ ఆసక్తి .. ఇండియాపై ఎన్నికల ఫలితాల ప్రభావం

అమెరికా ఎన్నికలపై ఇండియాలోనూ ఆసక్తి .. ఇండియాపై ఎన్నికల ఫలితాల ప్రభావం

అమెరికా భారతదేశాల మధ్య మంచి వాణిజ్య భాగస్వామిగా సత్సంబంధాలు కొనసాగించటంలో ఎవరైతే సమర్ధులు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అంతేకాకుండా చైనాతో ఇండియాకు ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ ఇప్పటికే చైనాతో ఇండియా కోసం పోరాటం చేస్తామంటూ మాటిచ్చారు. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ కు కాకుండా, జో బైడెన్ కు అమెరికన్ల అవకాశం ఇస్తే చైనా విషయం వరకు సహకరిస్తారా అన్నది కూడా ఆసక్తికర అంశం.

డెమోక్రాట్లు విజయం సాధించే అవకాశం

డెమోక్రాట్లు విజయం సాధించే అవకాశం

ఇక తాజా ఎన్నికల ఫలితాల ప్రకారం యూఎస్ లో డెమోక్రాట్లు విజయం సాధించేఅవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉండగా, కీలక రాష్ట్రాల్లో డోనాల్డ్ ట్రంప్ టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ అలాస్కా, అర్కాన్సాస్, కెంటుకీ, లూసియానా, మిస్సిస్సిప్పి, నెబ్రాస్కా, నార్త్ డకోటా, ఓక్లహోమా, సౌత్ డకోటా, టేనస్సీ, వెస్ట్ వర్జీనియా, వ్యోమింగ్, ఇండియానా మరియు దక్షిణ కరోలినాను గెలుచుకున్నారు. జో బైడెన్ కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, ఇల్లినాయిస్, మేరీల్యాండ్, మసాచుసెట్స్, న్యూజెర్సీ, న్యూ మెక్సికో న్యూయార్క్, రోడ్ ఐలాండ్ వెర్మోంట్ మరియు వర్జీనియా వంటి డెమొక్రాటిక్ మొగ్గు గల రాష్ట్రాలలో విజయకేతనం ఎగరవేశారు.

అమెరికా ఎన్నికల నేపధ్యంలో పూరీ గోల్డెన్ బీచ్ లో ట్రంప్ , జో బైడెన్ ల సైకత శిల్పం

అమెరికా ఎన్నికల నేపధ్యంలో పూరీ గోల్డెన్ బీచ్ లో ట్రంప్ , జో బైడెన్ ల సైకత శిల్పం

అమెరికా అధ్యక్ష ఎన్నికల పై సహజంగానే ఇండియాలో ఆసక్తి కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్ష ఎన్నికల పై ఒడిశాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తయారుచేసిన సైకత శిల్పం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తుంది.అమెరికా అధ్యక్ష అభ్యర్ధులైన డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ లకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఇసుకతో ఆయన తయారు చేసిన శిల్పం అందరినీ ఆకట్టుకుంటుంది. పూరి గోల్డెన్ బీచ్ లో అమెరికా జాతీయ జెండాతో పాటు డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ లను అందులో పొందుపరిచారు. దీని కోసం ఐదు టన్నుల ఇసుక వాడినట్లుగా తెలుస్తుంది. సమకాలీన అంశాలపై ఎప్పుడు స్పందించే సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అమెరికా అధ్యక్ష ఎన్నికల పై కూడా తన సైకత శిల్పంతో స్పందించారు .

English summary
US presidential election has attracted a lot of attention in India. Odisha-based sculptor Sudarshan Patnaik's sculpture on the US election quite interesting . He made a sand sculpture at Puri's Golden Beach . It's features the US national flag as well as Donald Trump and Joe Biden..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X