వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎస్ ఎంబసీలో దివాలీ వేడుకలు: దిల్బర్ అంటూ అమెరికన్ మహిళల డ్యాన్సులు(వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశమంతా ఆదివారం రోజున దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. కాగా, దీపావళి వేడుకల నేపథ్యంలో భారతీయు వస్త్రాలు ధరించి ఆడుతూపాడుతూ సంబరాలను చేసుకున్నారు విదేశీయులు. ఇది ఎక్కడో కాదు మనదేశంలోని అమెరికా రాయబార కార్యాలయంలో.

దీపావళి వేడుకలు

ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో శనివారం నుంచే దీపావళి వేడుకలు మొదలయ్యాయి. భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ.. ఈ కార్యాలయంలో జరిగిన వేడుకల వీడియోను ట్వీట్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వారికి భారతీయులు ధన్యవాదాలు చెబుతూ శుభకాంక్షలు తెలియజేస్తున్నారు.

వేడుకలు ఇలా..

కాగా, ఈ వీడియోలో బాలీవుడ్ సినిమాలోని ఓ పాటకు విదేశీ మహిళలంతా మన సాంప్రదాయ దుస్తుల్లో లయబద్ధంగా నృత్యాలు చేశారు. సత్యమేవ జయతే సినిమాలోని ‘దిల్‌బర్' పాటకి కార్యాలయంలోని మహిళా సిబ్బంది కాలుకదిపారు. పాటకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు.

ఉత్సాహపరిచారు..

అక్కడున్నవారు ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ వారిని ఉత్సహపర్చారు. భారతీయులంతా దీపావళి పండగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అమెరికా రాయబార కార్యాలయం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది.

నృత్యాలు భళా అంటూ..

దీపావళి సందర్భంగా అమెరికా కార్యాలయ సిబ్బంది మన సాంప్రదాయాలను, పండగలను గౌరవిస్తూ ఇలా చేయడంపై నెటిజన్లు వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీ నృత్యాలు భారతీయులను ఎంతో ఆకట్టుకున్నాయంటూ వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.

English summary
Though Diwali is still a day away, India is already busy celebrating this festival in full swing – and that includes the US Embassy in New Delhi too. The recent video shared by the Embassy on Twitter perfectly captures that festive mood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X