వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కులభూషణ్ కు ఉరి:; పాక్ వ్యూహాత్మక ఎత్తుగడే, ఇండియాపై ఒత్తిడికిలా..'

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్:భారత జాతీయుడు కులభూషన్ జాధవ్ కు పాకిస్తాన్ ఉరిశిక్ష విధించడంపై అమెరికా నిపుణఉలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ ను ఏకాకిగా నిలబెట్టాన్న భారత్ దౌత్య చర్యలకు వ్యతిరేకంగా గట్టి సందేశం ఇచ్చేందుకే దాయాది ఈ చర్యకు దిగి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఈ ఘటన ఆధారంగా భారత్, పాక్ సంబంధాలు మరింత దెబ్బతినే అకాశాలు ఉన్నాయని అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు పూర్తిగా నిలిచిపోయి, రానున్న రోజులు మరింత అంధకారమయంగా మారే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.

గూఢచర్యం ఆరోపణలపై కులభూషన్ జాదవ్ ను పాకిస్తాన్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించింది.భారత్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడే ఉరిశిక్షను అమలు చేయబోమంటూ పాక్ వెనక్కు తగ్గింది. అయితే గూఢచర్యం, జాతి వ్యతిరేక కుట్ర అభియోగాలు ఎదుర్కొంటున్న కులభూషణ్ పై విచారణను ఆదరాబాదరగా చేయడం తగినంతగా ఆధారాలు లేకుండానే ఆయనకు శిక్షను విధించడాన్ని అమెరికాకు చెందిన దక్షిణ మధ్య ఆసియా బ్యూరో మాజీ సీనియర్ అధికారి అలిస్సా, ఆయ్ రెస్ తప్పుబట్టారు.

US experts cite ‘flimsy’ evidence in Kulbhushan case, question slow 26/11 trial

ఒకవైపు కులభూషణపై విచారణను వేగంగా చేపట్టిన పాక్ ...మరో వైపు ముంబై దాడుల కేసులో తమ దేశంలో జరుగుతున్న విచారణను నిత్యం వాయిదాలతో జాప్యం చేస్తుండడంపై విస్మయం వ్యక్తం చేశారు.

సరైన ఆధారాలు లేకుండా రాజకీయ ప్రేరేపణతోనే కులభూషణ్కు శిక్ష విధించినట్టు కన్పిస్తోందన్నారు. తమ దేశంలో అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురాకుండా ఉండేలా హెచ్చరించేందుకు పాక్ ఈ చర్యకు పాల్పడినట్టుందని అమెరికా మేదో సంస్థ సభ్యురాలు సీనియర్ ఫెల్లో అభిప్రాయపడ్డారు.

రానున్న రోజుల్లో గడ్డుకాలాన్ని ఇరుదేశాల సంబంధాలు ఎదుర్కొనే అవకాశం ఉందని మరో విదేశీ వ్యవహరాల నిపుణుడు ప్రతిష్టాత్మక వుడ్రో విల్సన్ సెంటర్ లో దక్షిణాఫ్రికా వ్యవహరాల సీనియర్ అసోసియేట్ మైఖేల్ కుజల్మన్ చెప్పారు.

English summary
Top US experts have expressed concern over Pakistan’s decision to give death penalty to Indian national Kulbhushan Jadhav as they warned that Islamabad wants to send a “strong message” to India against isolating it on the world stage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X