వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్‌ను గాంధీతో పోల్చిన యూఎస్ మీడియా

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 200వ టెస్టు మ్యాచుతో క్రికెట్‌కు స్వస్తి పలకనున్న నేపథ్యంలో ప్రపంచ మీడియా మాస్టర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా మీడియాలో సచిన్ టెండూల్కర్‌పై అనేక సంచికలు వెలువడుతున్నాయి. క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ సుప్రీం అని, వ్యక్తిగతంగా ఆయన మృధు స్వభాగం గలవాడని, గొప్ప మానవతా వాది అని అమెరికా మీడియాపై మాస్టర్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.

సచిన్ టెండూల్కర్ ఫొటోతో కూడిన కథనం ప్రచూరించిన న్యూయార్క్ టైమ్స్‌, అందులో క్రికెట్ నుంచి సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ అవడాన్ని మహ్మాత్మా గాంధీ మరణంతో పోల్చుతూ తన కథనాన్ని కొనసాగించింది. భారతదేశంలో మహత్మా గాంధీ తర్వాత మాస్టర్ టెండూల్కరే అంతటి గౌరవ, అభిమానాలను దేశం నుంచి పొందుతున్నారని పేర్కొంది. భారతదేశంలోని అభిమానులందరూ క్రికెట్ నుంచి సచిన్ నిష్ర్కమిస్తున్నాడనే బాధలో ఉన్నారని, అయితే అతను క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా.. క్రికెట్ దేవుడు అభిమానుల మదిలో నాటౌట్‌గా ఉంటాడని పేర్కొంది.

Sachin Tendulkar

సచిన్ టెండూల్కర్ రిటైర్ అవుతున్న ఈ వారం ప్రపంచంలోని కొన్ని కోట్ల మందికి గుర్తుండిపోతుందని, వెస్డిండీస్ జట్టుతో భారత జట్టు తలపడనున్న రెండో టెస్టు మ్యాచు తర్వాత సచిన్ రమేష్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించరని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ కథనాన్ని ‘ఫేర్ వెల్ టు క్రికెట్ లిటిల్ మాస్టర్' అనే శీర్షికతో ప్రచూరించింది. క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌కు సంబంధించిన 10 గొప్ప క్షణాలతో కూడిన ఆన్‌లైన్ ఫీచర్‌ను టైమ్ మేగజైన్ ప్రచూరించింది.

అంతేగాక 1988లో వినోద్ కాంబ్లీతో కలిసి అజేయంగా 664 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన ఘట్టాన్ని, 23ఏళ్లకే 1996లో భారత కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన, 2008, 2011 ప్రపంచ కప్‌లలో అత్యధిక పరుగులను సాధించి బ్రియన్ లారా పేరుతో ఉన్న రికార్డును మాస్టర్ అధిగమించినటువంటి పలు అంశాలతో కూడిన ఆన్‌లైన్ ఫీచర్‌ను టైమ్ మేగజైన్ రూపొందించింది.

ప్రపంచ క్రీడా చరిత్రలో సచిన్ టెండూల్కర్ ఒక గొప్ప ఆటగాడని, క్రికెట్‌లో దాదాపు అన్ని రికార్డులను తన పేరునే లిఖించుకున్నాడని పేర్కొంది. మాస్టర్ టెస్టుల్లో 15వేల పరుగులను, అంతర్జాతీయ వన్డేల్లో 18వేల పరుగులపైనే ఉన్నాయని, టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 100 సెంచరీలు సాధించాడని తెలిపింది. 16ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో ఆడి అద్భుతంగా రాణించి, 40ఏళ్ల వరకు తన ఆధిపత్యాన్ని కొనసాగించి క్రికెట్‌లో అగ్ర‌స్థానంలో మాస్టర్ ఉన్నాడని అమెరికాకు చెందిన మరో ఆన్‌లైన్ పత్రిక డబ్ల్యూఎస్‌జె పేర్కొంది.

English summary
Cricket may not be too big a sport in this part of the world but leading US publications have nonetheless paid tribute to retiring Indian superstar Sachin Tendulkar, applauding the veteran batsman for his "supreme" talent and a career lived with soft-spoken integrity and humility.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X